Menu Close
mg

చంద్రుడిలో వుండే కుందేలు

పచ్చని పంటచేలతో నిండిన గ్రామం ఒక ప్రక్క, విదేశంలో ప్రఖ్యాతిగాంచిన పట్టణ వాతావరణం మరోవైపు, రెండూ కలిసి ఒకే ఫ్రేమ్ లో పలికిస్తే అందమైన నాయకి ఆలోచనలు, చిలిపి ఆలోచనలతో గజిబిజిగా ఉన్న నాయకుని ప్రవర్తనలు అంతా ప్రేమమయం అని చాటి చెప్పిన ఈ చంద్రునిలో వుండే కుందేలు...చుక్కల్లో ఉండే జిగేలు.. ఇలా ఎటువంటి ఉత్ప్రేక్షాన్నైన చెప్పగలిగిన సత్తా ఒక కవికి మాత్రమే ఉంటుందని మరోసారి చాటిచెప్పిన ఈ పాట, మీ కోసం.

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా

సంగీతం: దేవిశ్రీప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల

గానం: శంకర్ మహదేవన్

చంద్రుల్లో వుండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా..
తందానే తందానే

చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా ..
నిన్ను మెచ్చి నీలో చేరిందా..
తందానే తందానే

నువ్వలా సాగే తోవంతా ..
ఆవలా తూగే నీవెంట ..
ఏవంట

నువ్వెళ్ళే దారే మారిందా
నీవల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా ..

ఓ ..ఓ...

చంద్రుల్లో వుండే కుందేలు కిందికొచ్చిందా
కిందికొచ్చి నీలా మారిందా

ఏలే ఏలే ఏలే .. ఏలే ఏలే ఏలే.. ఏలే ఏలే ఏలే ఏలే ఏలే ఏలేలో..ఏలేలో ...

ఓ ...ఓ..హే..హే..ఓ..ఓ..హేహే
హాయ్ ఐ యాం సంతోష్ ..మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ ...స్టెల్లా ....
స్టెల్లా.. ఓ .. వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్..

గువ్వలా దూసుకు వచ్చావే తొలి యవ్వనమా
తెలుసా ఎక్కడ వాలాలో
నవ్వులే తీసుకు వచ్చావే ఈడు సంబరమా ..
తెలుసా ఎవ్వరికివ్వాలో

హే గ గ గ రి గ రి స స గ రి రి స
గ గ గ రి గ రి స స గ రి రి స ఆ ఆ

కూచిపూడి అన్న పదం కొత్త ఆట నేర్చిందా
పాట లాంటి లేత పదం పాఠశాలగా..
కూనలమ్మ జానపదం పల్లె దాటి వచ్చిందా ..
జావళీల జాణ తనం బాట చూపగా.. ఆ..
కుంచెలో దాగే చిత్రాలు ఎదురొచ్చేలా ..
అంతలా ఎన్నో వర్ణాలు...
మంచులో దాగే చైత్రాలు బదులిచ్చేలా..
ఇంతలా ఏవో రాగాలు..

ఆకతాయి సందడిగా ఆగలేని తొందరగా..
సాగుతున్న ఈ పయనం ఎంతవఱకో..
రేపు వైపు ముందడుగా లేనిపోని దుందుడుకా..
రేగుతున్న ఈ వేగం ఎందుకొఱకో..
మట్టి కీ మబ్బు కి ఈవేళ దూరమెంతంటే...
లెక్కలే మాయం అయిపోవా..
రెంటినీ ఒక్కటి చేసేలా తీరమేదంటే...
దిక్కులే తత్తరపడిపోవా..

Posted in April 2018, పాటలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!