దేశ ఐక్యతకు తోడ్పడే వారధులు
రైల్ - రోడ్ వంతెనలు:
అనేక దేశాలలో (చైనా, జపాన్, అమెరికా, బ్రిటిష్ దీవులలో) రెండు రైలు పట్టాల మధ్య ప్రమాణ దూరం నాలుగు అడుగుల ఎనిమిదన్నర అంగుళాలు కాగా, సోవియెట్ యూనియన్ వాడే కొలత 4 అడుగుల 11.7 అంగుళాలు కాగా ఆస్ట్రేలియా, ఐర్లాండ్ వాడే కొలత 5 అడుగుల 3 అంగుళాలు మరియు స్పెయిన్, పోర్చుగల్ వాడె కొలత 5 అడుగుల 7 అంగుళాలు. ఆవిధంగా వివిధ దేశాల కొలతలు వేర్వేరవడంతో ప్రపంచము ఈమూలనుంచి ఆ మూలకి రైళ్ళు నడపడం సాధ్యం కాదు.
దక్షిణ అమెరికా దేశాలు, భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, 'బ్రాడ్ గేజ్' అనగా ఐదు ఆడుగుల ఆరంగుళాలు పట్టాల మధ్య దూరంతో రైళ్ళు నడుస్తున్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ పాలనావ్యవస్థ దేశ రైలు మార్గాలు వేయడం ప్రారంభించినప్పుడు అప్పటి రవాణా అవసరాలు, ప్రయాణీకుల రద్దీ, నిర్వహణ ఖర్చులు పరిగణలోకి తీసుకుని మూడు రకాల రైలు మార్గాలు నిర్ణయించారు. 'బ్రాడ్ గేజ్': 5 '- 6", 'మీటర్ గేజ్': 3 ' - 3 3 /8", 'నారో గేజ్': 2 ' - 6 " {పర్వత ప్రాంతాలలోను, పారిశ్రామిక వాడలలోను దీనిని ఖర్చు తగ్గించడానికి ఎక్కువగా వాడారు}. జనప్రవాహం పెరగడం ద్ర్యష్ట్యాను, జన ప్రయాణాలకు, సరకుల రవాణాకు నడపాల్సిన రైళ్ళ సంఖ్య పెరగడం ద్ర్యష్ట్యాను చాలా మార్గాలలో వున్నా మార్గం ప్రక్కనే రండో మార్గం నిర్మించడం జరిగింది. అవసర సమయాలలో దారిని మళ్ళించే వీలు కోసరం మీటర్ గేజ్, నారో గేజ్ లన్నింటినీ బ్రాడ్ గా మార్చటం జరిగింది. దీనివల్ల దేశమంతా ఒకే రైలు ప్రమాణానికి వీలు కలిగింది.
రహదారి విషయానికి వస్తే భారతదేశంలో రహదారి వెడల్పు సాదారణంగా 3.5 మీటర్లు లేక పదకొండున్నర అడుగులు. రెండు లేన్ల జాతీయ రహదార్లకి ఏడు మీటర్లు లేక 23 అడుగులు. అదే నాలుగు లైన్ల హైవే అయితే 45 మీటర్లు లేక 150 అడుగులు. వీలైనంత వరకు రైలు వంతెనల పైనే రహదారి కూడా వచ్చేటట్లు అమర్చారు.
"బోగిబీల్ వారధి"- అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నదిపై గల ఈ వంతెన పొడుగు 4.94 కిలోమీటర్లు. 'ధేంజి' నగరాన్ని 'డిబ్రుగర్ని' కలిపే ఈ వంతెన అత్యంత ప్రాముఖ్యాన్ని సంతరించుకుని దేశంలోనే కాక ఆసియాలోనే అత్యంత పొడవైన రైల్ -రోడ్ వంతెనగా నిలిచింది. క్రింద భాగంలో రెండు రైలు దారులు ఉండగా పైభాగంలో మూడు లేన్ల రహదారి మార్గం సరుకుల రవాణాకి, ఇతర సామాజిక అవసరాలను తీర్చ గలదై టిబెట్ కి అరుణాచల్ ప్రదేశ్ కి గల సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల నైసర్గిక ప్రాధాన్యతను అలరించుకుంది. NH 15మార్గంలో గల ఈ రైల్ రోడ్ వంతెన అనేక అవాంతరాల నడమ 1767 కోట్ల మొదటి అంచనాలని 334 శాతం అధిగమించి 5960 కోట్ల తో (US $ 700 మిల్లియన్లు) నిర్మాణం పూర్తవ్వడానికి 16న్నర ఏళ్ళు పట్టింది. ఇది భూకంపం 'రిచెర్స స్కేల్' పై 7 వరకు తట్టుకునే సామర్ధ్యం కలిగిఉంది. 120 సంవత్సరాల జీవితపరిధి గల ఈ వంతెనను 125 మీటర్లు స్పాంలు గల 42 స్తంభాలు నిలబెడుతున్నాయి.
వెంబనాడ్- రైల్ వంతెన: 62 కిలోమీటర్లు పొడవైన, 5 మీటర్లు వెడల్పు గల ఈ రైల్-రోడ్ వంతెన కేరళలో ఎడ్డప్పల్లి- వాళ్ళార్పడం లని కలుపుతూ వెంబనాడ్ సరస్సుపై కొచ్చిన్ సమీపంలో నిర్మింపబడింది. 2011 లో ప్రారభింపబడిన ఈ వంతెన కూడా బీమ్ బ్రిడ్జి 33 స్పాన్ లు 20 మీటర్లు 99 స్పాన్ లు 40 మీటర్లు నివిడిగల ఈ వంతెన మూడు దీవులని దాటుతూ పయనిస్తుంది.
దీఘా - సోన్పూర్ రైల్ - రోడ్ వంతెన: గంగ నది పై బీహార్లోని పాటలీపుత్రం వద్ద 2016 లో నిర్మింపబడినది. దీని పొడవు 55 కిలోమీటర్లు. ఈ వంతెన ‘జయ ప్రకాష్ నారాయణ్ సేతు’ గా కూడా పిలవబడుతోంది. ఇది ఉత్తర దక్షిణ బీహార్లను రైలు రోడ్ మార్గాలని కలుపుతూ అతి ముఖ్య వారధి గా 2016 నుంచి సేవలందిస్తోంది.

గోదావరి నది పై వంతెనలు: గోదావరి నది పై రాజమండ్రి -కొవ్వూరుల మధ్య మూడు వంతెనలు నిర్మించబడ్డాయి. ఒకటి రైల్-రోడ్ వంతెన అయితే తక్కిన రెండు రైల్ వంతెనలు. మొదటి రైల్ వంతెన - హేవలాక్ వంతెన 76 కిలోమీటర్ల పొడవున 56 స్పాన్ ల వంతెన 1900 సంవత్సరంలో హౌరా - మద్రాస్ రైల్ మార్గంలో భాగం గా నిర్మింపబడింది. దాని జీవిత కాలం ముగుస్తున్న సందర్భంలో 2003 లో 350 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లకు సమర్ధవంతంగా రెండవ వంపు వంతెన నిర్మాణం జరిగింది. 1974 లో 27 స్పాన్ లుతో 4 .1 కిలోమీటర్ల పొడవుగల రైల్-రోడ్ బ్రిడ్జి నిర్మితమైంది. దీని పైభాగంలో రేడు లేన్ల రోడ్, క్రింద ఓకే రైల్ మార్గంతో ట్రస్ వంతెన ఉపయోగంలోకి తీసుకుని రాబడింది. ఈ వంతెన 3 ఘనపు మీటర్ల మిలియన్ల నీటి తాకిడిని, 5 మీటర్ల నీటి వేగాన్నితట్టుకునే విధంగా నిర్మించబడింది.

కృష్ణానదీ వారధులు: కృష్ణానది పై విజయవాడ వద్ద మూడు రైలు వంతెనలు, 1 కిలోమీటర్ల పొడవుతో 'ప్రకాశం బ్యారేజ్' పై గల రహదారి మరియు 2.6 కిలోమీటర్ల పొడవుతో 4 లేన్ల 'కనదుర్గ వారధి'. ఇవి కాకుండా పెనుమూడి-పులిగడ్డ వంతెన (2 .95 కిలోమీటర్ల -NH 214 లో భాగంగా) ఉన్నాయి. ఇవి విజయవాడ గుంటూరు, తెనాలి, నూతన రాజధాని అమరావతిని అనుసంధానం చేస్తూ కొలకత్తా చెన్నైల మధ్య గల ప్రధాన రహదారి NH16 లో భాగమై ఉంటాయి.
సముద్రం పై రైలు వంతెనలు:

మండపం -రామేశ్వరం ల మధ్య పాంబన్ దీవిని కలుపుతూ వంద స్పాన్ లతో 2.07 కిలోమీటర్ల పొడవైన రెండు రైలు మార్గాల నివిడితో నిర్మించిన ఈ ఆధునిక వంతెన -మధ్యలో 72 .5 మీటర్ల ద్వారం కలిగి దాని ద్వారా ఓడలు పోయేటప్పుడు మూడున్నర నిముషాలలో పైకి 17 మీటర్లు పైకి లేచి వాటికి దారి సమకూర్చే విధంగా నిర్మింపబడిన ఈ అత్యాధునిక బ్రిడ్జి, 50 ఏళ్ళు పనిచేసి 1964 తుఫాను తాకిడికి కూలిపోయిన పంబన్ రైలు వంతెన లేని లోపాన్ని భర్తీ చేస్తూ నిర్మింపబడింది. ఇది 2024 లో ఉపయోగంలోకి తీసుకుని రాబడింది. ఫోటోలో ఎడమవైపుది రహదారి వంతెనైతే మధ్యలోది కూలిపోయి నిరుపయోగంగా మిగిలిపోయిన పాత రైలువంతెన. నూతన నిర్మాణం కుడివైపు చూడవచ్చు.
సముద్రం పై రోడ్డు వంతెన

బాంద్రా - వోర్లి సముద్ర వలయం(రాజీవ్ గాంధీ సముద్ర వలయం గా కూడా పిలవబడుతుంది): ఐదవ పొడవైన వంతెన గా గణుతింప బడిన ఈ వంతెన మాహిమ్ సముద్ర దారి పై ఉన్నది. 2009 లో ప్రారభింపబడిన ఈ 5.6 కిలోమీటర్ల పొడవు, 40 మీటర్ల వెడల్పు గల ఈ ' స్టే' వంతెన వర్లి లోని 'వెస్ట్రన్ ఎక్ష్ప్రెస్స్ హైవే' ని బాంద్రాలోని 'స్వామి వివేకానంద రోడ్' ని కలుపుతుంది. ఉరులోంచి రోడ్ దారిన ప్రయాణించే సమయం అరగంట ఐతే దీనిపై ప్రయాణం పది నిముషాల కి కుదించ బడి వాహనదారులకు ఎంతగానో ఉపయుక్తం గా ఉంది, ప్రత్యేకంగా కార్యాలయ సమయాలలో. ఈ వంతెనపై సాధారణముగా రోజువారీ రద్దీ 32,312 వాహనములు గా 2018 లో నమోదు చెయ్య బడింది.
అగాధాన్ని దాటుతూ పర్వతాల పై రైలు వంతెన:

ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైలు వంతెనగా కొనియాడబడుతున్న కాశ్మీర్లోని రియాసీ తాలూకా లోని చీనాబ్ నది పై గల ఈ ఉక్కు, కాంక్రీట్ వంపు వంతెన వంతెన 1.3. కిలోమీటర్ల పొడవు, చీనాబ్ నదీ మట్టం మీదనుంచి 359మీటర్ల ఎత్తుతో (ఎత్తులో ఫ్రాన్స్ లోని ఎఫల్ టవర్ కంటే మరియు కుతుబ్ మీనార్ కంటే కూడా ఎక్కువ) ఉండి 'ఉదంపూర్ బారాముల్లా రియాల్ లింక్ ప్రాజెక్ట్' లో భాగమై, కాశ్మీర్ కన్యాకుమారి లను అనుసంధానిస్తూ దేశానికే తలమానికం గా నిలుస్తోంది. దీని ‘వక్రపు వ్యవధి’ – (arch span size) 467 మీటర్లు గలిగి, ఘంటకి 260 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణానికి అనుకూలంగా రెండు రైల్ మార్గాలు గల (13.5 మీటర్ల వెడల్పు తో), 17 స్పాన్లతో, 120 సంవత్సరాలు జీవితకాల ప్రమాణంతో ₹14.86 బిలియన్ల ఖర్చుతో నిర్మింపబడిన ఈవంతెన జూన్ 6న ప్రారంభించ బడింది. దాని ప్రణాళికను రచించినది (డిజైన్ చేసింది) WSP ఫిన్లాండ్ మరియు DRDO. దీనిపై ప్రజల మొదటి ప్రయాణం 'వన్డే భారత్ ఎక్ష్ప్రెస్స్' తో ప్రారంభమై, ఈ రైల్ ప్రస్తుతం రోజుకి రెండు సార్లు కాట్రా (విష్ణోవి దేవి ఆలయ స్థానం) - శ్రీనగర్ ల మధ్య నడుస్తోంది. చైనా 'బీపామ్' నది ఉపరితలం పై 565 మీటర్ల ఎత్తులో 'హ్యాంజహౌ -రుయిలి ఎక్ష్ప్రెస్స్ వే' వంతెన నిర్మిస్తోంది. పర్వత మార్గంలో నిర్మిస్తున్న ఈ రహదారి వంతెన పూర్తి అయిన తరువాత చీనాబ్ రైల్ వంతెనకంటే ఎతైన దౌతుంది.

అటల్ నడకదారి వంతెన:

సబర్మతి నది పై గుజరాత్ లో నిర్మించబడ్డ ఈ 'అటల్ నడకదారి వంతెన' పొడవు ౩౦౦మీటర్లు, 10 మీటర్ల వెడల్పు గల ఈ నడక వంతెన దారి ఉపయోగించే రోజువారీ ప్రయాణీకులే కాక సందర్శకులు కూడా దానిపై నదిపై వీచే చల్ల గాలిలో నడవడానికి ఉత్సుకత చూపిస్తారు. వంతెన పై నడుస్తుంటే కనబడే సుందర దృశ్యం ఫోటోలోపలి పటంలో చూపబడింది. ప్రపంచంలో అతి పొడవైన 721 మీటర్ల నడక దారి వంతెన, లోయపై 95మీటర్ల ఎత్తున వేళ్ళాడుతూ డాలని మరోవా వద్ద, చెక్ రిపబ్లిక్ లో ఉంది.

-o0o-
Bridges river wise will make the article too big, I felt. Not only that many readers perhaps, will not be interested in the civil engineering marvels.
Very good effort in bringing out the various important bridges in India,
I feel it would have been more appropriate had it been river wise,
It’s a great effort sir, All the best in bringing out various projects that have come up in the recent past for the benefit of readers,🙏