
సంగీతం పై సాహిత్య ప్రభావం
ఖ.) కొసరాజు రాఘవయ్య చౌదరి
1. (చిత్రం: రాముడు భీముడు, సంగీతం: సత్యం, పాడినవారు: మాధవపెద్ది సత్యం, జమునారాణి) లింక్ »
మగ : సరదా సరదా సిగిరెటూ ఇది దొరల్ తాగు బల్ సిగరెట్టు...
పట్టుబట్టి ఒక దమ్ము లాగితే స్వర్గానికి యిది తొలి మెట్టూ ||సరదా||
ఆడ: వా కంపు గొట్టు ఈ సిగరెట్టు దీన్ని కాల్చకోయీ నాపై ఒట్టూ ||కంపు||
కడుపు నిండునా కాలు నిండునా వదిలి పెట్టవోయ్ నీ పట్టూ ||కంపు||
మగ: ఈ సిగిరెట్టుతో ఆంజనేయుడు లంకా దహనం చేశాడూ
ఆడ: హా ఎవడో కోతలు కోశాడు
మగ: ఈ పొగ తోటీ గుప్పు గుప్పున మేఘాలు సృష్టించవచ్చూ
ఆడ: మీసాలు కాల్చుకోవచ్చూ
మగ : ||అ... సరదా||
ఆమె: ఊపిరి తిత్తుల క్యాన్సరుకిదియే కారణమన్నారు డాక్టర్లు
మగ: కాదన్నారులే పెద్ద యాక్టర్లు
ఆమె: పసరు పేరుకొని కఫము చేరుకొని ఉసురు తీయు పొమ్మన్నారూ
మగ: దద్దమ్మలు అది విన్నారూ
ఆమె: హా ||కంపు||
మగ: పక్కనున్న వాళ్ళీ సువాసనకు ముక్కులు ఎగరేస్తారు
ఆడ: వా..
మగ: నీవెరుగవు దీని హుషారు
ఆడ: అబ్బో థియేటర్ల లో పొగ తాగడమే నిషేధించినారందుకే
మగ: కలెక్షన్లు లేవందుకే ||సరదా||
ఆడ: ||కంపుగొట్టు||
మగ: కవిత్వానికీ సిగిరెట్టూ కాఫీకే యిది తోబుట్టు.
ఆడ: పైత్యానికి యీ సిగిరెట్టూ బడాయి కిందా జమకట్టూ
మగ: ఆనందానికి సిగిరెట్టూ ఆలోచనలను గిలగొట్టూ
ఆడ: పనిలేకుంటే సిగిరెట్టూ తిని కూర్చుంటే పొగబట్టూ
మగ: రవ్వలు రాల్చే రాకెట్టూ రంగు రంగులా పాకెట్టూ
ఆడ: కొంపలు కాల్చే సిగిరెట్టూ దీని గొప్ప చెప్ప చీదర బుట్టూ||సరదా||
2. {చిత్రం: తోడికోడళ్లు, సంగీతం: మాస్టర్ వేణు, పాడినవారు: ఘంటసాల, జిక్కి} లింక్ »
అతడు : తింటానిక్కూడు చాలదే, జాంగిరీ ఉంటానికిల్లు చాలదే
బస్తీకి పోదాం పైసా తెద్దామే రావేనా రంగసానీ!!
ఆమె : టౌను పక్కకెల్లొద్దురా డింగరీ! డాంబికాలు పోవొద్దురా
టౌను పక్కెళ్ళేవు డౌనైపోతావురా రబ్బీ బంగారు సామి!
అతడు : రెక్కలన్నీ ఇరుసుకుంట రిక్షాలు లాక్కుంట
చిల్లరంత జేర్చుకుంట సినిమాలు చూసుకుంట
షికార్లు కొడదామే - పిల్లా జలసా చేద్దామే "బస్తీకి"
ఆమె: కూలి దొరకదూ నాలిదొరకదూ
గొంతు తడుపుకొన నీరు దొరకదూ
రేయింబగలూ రిక్షా లాగిన
అద్దెకు పోనూ అణా మిగలదు
గడప గడపకు కడుపు బట్టుకుని ఆకలాకలని అంగలార్చితే
గేటు బిగించీ కొట్టొస్తారు!
కుక్కలనే ఉసి కొల్పిస్తారు "టౌను పక్క"
అతడు: ఫ్యాక్టరీలలో పని సులువంట
గంటయిపోతే ఇంట్లో ఉంట
వారం వారం బట్వాడంట
ఒరే అరే అన వీల్లేదంట
కాఫీ తోటే గడపొచ్చంట కబుర్లు చెప్పుకు బ్రతకొచ్చంట
చూడ చిత్రమంట పిల్లా! చోద్యమౌతదంట "బస్తీకి"
అతడు : పిప్పయి పోయే పిచ్చి ఖర్చులు పోకిరి మూకల సావాసాలు
చీట్ల పేకలు సిగసిగ పట్లు తాగుడు వాగుడు తన్నులాటలు
ఇంటి చుట్టునా ఈగలు దోమలు
ఇరుకు సందులు మురుగు వాసనలు
అంటురోగములు తగిలి చచ్చినా
అవతల కీడ్చే దిక్కు ఉండదు " టౌను"
అతడు : ఏలికేస్తేను కాలికేస్తావు ఎనక్కు రమ్మని గోల జేస్తావు
ఏ దారంటే గోదారంటవు ఇరుకున బెట్టి కొరుక్కుతింటవ్
దిక్కు దోచనీయవే పిల్లా! తికమక జేసేవే
బస్తీకి నే బోను నీతో ఉంటానే! రాణీ నా రంగసానీ
గొడ్డూ గోదా మేపుకుందాం! కోళ్ళూ మేకలు పెంచుకుందాం
కూరానారా జరుపుకుందాం! పాలూ పెరుగు అమ్ముకుందాం
పిల్లా జెల్లను సూచుకుందాం! కలో గంజియో తాగి పడుందాం
ఇద్దరు : టౌను పకక్కెళ్ళద్దండోయ్ బాబూ
డాంబికాలు పోవద్దండోయ్
టౌను పక్కకెళ్ళేరు డౌనైపోతారు!
తానే తందాన తాన తందాన! తందాన తాన
3. {చిత్రం: కులగోత్రాలు, సంగీతం: ఎస్ రాజేశ్వర రావు , పాడినవారు: మాధవపెద్ది సత్యం, పిఠాపురం} లింక్ »
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
ఉన్నది కాస్తా ఊడింది
సర్వ మంగళం పాడింది
పెళ్ళాం మెళ్ళో నగలతో సహా
తిరుక్షవరమై పోయింది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
ఆ మహా మహా నలమహారాజుకే
తప్పలేదు భాయీ
ఓటమి తప్పలేదు భాయీ
మరి నువ్వు చెప్పలేదు భాయీ
ఆది నా తప్పుగాదు భాయీ
తెలివి తక్కువగా
చీట్ల పేకలో దెబ్బ తింటివోయీ
బాబూ నిబ్బరించవోయీ
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
గోవిందా...గోవిందా...
నిలువు దోపిడీ దేవుడికిచ్చిన
ఫలితం దక్కేది
ఎంతో పుణ్యం దక్కేది
చక్కెర పొంగలి చిక్కేది
ఎలక్షన్లలో ఖర్చుపెడితే
MLA దక్కేది
మనకు అంతటి లక్కేది
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
గెలుపూ ఓటమి దైవాధీనం
చెయ్యి తిరగవచ్చు
మళ్ళీ ఆడి గెల్వవచ్చు
ఇంకా పెట్టుబడి పెట్టవచ్చు
ఇల్లు కుదవ చేర్చవచ్చు
చాన్సు తగిలితే ఈ దెబ్బతో
మన కరువు తీరవచ్చు
పోతే ..
అనుభవమ్ము వచ్చు
చివరకు జోలె కట్టవచ్చు
అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే
అయ్యయ్యో జేబులు ఖాళీ ఆయెనే
4. (చిత్రం: రోజులు మారాయి, సంగీతం: మాస్టర్ వేణు, పాడినవారు: జిక్కి) లింక్ »
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా
కల్లా కపటం కానని వాడా
లోకం పోకడ తెలియని వాడా
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా
నవధాన్యాలను గంపకెత్తుకుని
సద్ది అన్నము మూటగట్టుకుని
నవధాన్యాలను గంపకెత్తుకుని
సద్ది అన్నము మూటగట్టుకుని
ముళ్ళ గర్రను చేత బట్టుకుని
ఇల్లాలిని నీ వెంట బెట్టుకుని
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా
పడమటి దిక్కున వరద గుడేసే
ఉరుముల మెరుపుల వానలు గురిసే
పడమటి దిక్కున వరద గుడేసే
ఉరుముల మెరుపుల వానలు గురిసే
వాగులు వంకలు ఉరవడిజేసే
ఎండిన బీళ్ళు ఇగుర్లు వేసే
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా
కోటేరును సరిజూసి పన్నుకో
ఎనపట దాపట ఎడ్ల దోలుకో
కోటేరును సరిజూసి ఎన్నుకో
యలపాట దాపట ఎడ్ల దోలుకో
చాళ్ళు తప్పక కొందర వేసుకో
విత్తనము విసిరిసిరి జల్లుకు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా
పొలాలమ్ముకుని పోయేవాళ్ళు
టౌన్ లో మేడలు కట్టే వాళ్ళు
బ్యాంకుల డబ్బు దాచే వారు
నీ శక్తిని గమనించరు వారు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురో రన్నో చిన్నన్నా
పల్లేటూళ్ళలో చెల్లని వాళ్ళు
పాలిటిక్స్ తో బ్రతికే వాళ్ళు
ప్రజాసేవయని అరచే వాళ్ళు
ప్రజాసేవయని అరచే వాళ్ళు
ఒళ్ళు వంచి చాకిరికి మళ్ళరు
ఏరువాక సాగారో రన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా
పదవులు స్థిరమని బ్రమిసే వాళ్ళే
ఓట్లు గుంజి నిను మరిచే వాళ్ళే
నీవే దిక్కని వత్తురు పడవోయ్
నీవే దిక్కని వస్తురు పడవోయ్
రోజులు మారాయ్ రోజులు మారాయ్
మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా
ఏరువాక సాగారోరన్నో చిన్నన్నా
నీ కష్టమంత తీరునురోరన్నో చిన్నన్నా