అయ్యగారి వారి ఆణిముత్యాలు
(అయ్యగారి సూర్యనారాయణమూర్తి విరచిత పద్యశ్లోకాలు)
శ్రీరామనవమి సీ. మానవాకృతిఁ దాల్చి మనుజధర్మంబులఁ దనజీవితంబునఁ దగిన రీతిఁ బాటించి చాటించి ప్రతిభూతహితుఁ డౌచు ధర్మంబు నాల్గు పాదాల నడిపి శాపవిమోచనల్ తాపసవైరిమ ర్దన సేసి శాంతినిఁ బ్రస్తరించి తనసౌఖ్యములకన్నఁ దనప్రజాక్షేమమే ధ్యేయంబుగా రాజ్య మేల, భ్రాతృ తే.గీ. మాతృగురుపూర్వజులు మెచ్చ క్ష్మాతలాన ధర్మమూర్తి జనించిన ధన్యదినము రామనవమి యొసంగుత రామరక్ష! విశ్వమానవశ్రేయస్సు వెల్లివిరియ 181 బాలరాముఁడు మ.కో. బాలరామునిమూర్తి(1) కన్నను(2) బండు వున్నదె కళ్ళకున్? బాలరామునిఁ గన్న(3) వారినిఁ బాపముల్ దరిఁజేరునే? బాలరామునిఁ గన్న(4) కానుపె భాగ్యదం బగుఁ గాను, పా (5) బాలరాముని కన్న(6) సర్వప్రపంచమే హితకారియౌ (1) ఆకారము (2) కంటె (3) చూచిన (4) ప్రసవించిన (5) కానుపు +ఆ (6) రామునికి+అన్న= రామునికొఱకు అనిన 182 మార్పు మ.కో. రంగురంగుల విశ్వమందున రమ్యమౌ సుమరాశులే రంగులీనుట మొగ్గ మొగ్గగ మ్రగ్గ సాధ్యమె సృష్టిలో? గొంగళుల్ తగు మార్పుఁ జెందక కూర్చునే హరుసంబు? పా తంగికం(1) బయి వైద్యపూజల ధన్యమౌ మకరందమే (1) తేనెటీగకు సంబంధము కలది (తేనె) 183 ప్రపంచపుస్తకదినోత్సవము సీ. పోతనార్యుఁడె దీనిఁ జేతఁ బూని సరస్వ తినిఁ గొల్చి కావించె తన రచనను బహురూపధారియై బహువిధాంశజ్ఞాన నిధి యౌచు, వాణికి నిలయమగుచు, బడి కేఁగు పిల్లల యొడిఁజేరు ముందుగా వీ పెక్కి కూర్చొను ప్రియసఖుండు దేవాలయము లట్లు దీని కాలయములు విస్తృతంబుగ నుండు విశ్వమంత తే.గీ. హస్తభూషణ మన్నను వాస్తవముగఁ గాదు, కాలంబు వృథ కాక మోదమొసఁగు వేచి యుండెడి వేళల వెంట నుండి, పుస్తకదినోత్సవముసాటి పుడమిఁ గలదె? 184 చం. పదముల తోడ నాడుకొను పద్యములన్ రచియింపఁజేసి త త్పదముల తోడ నాడుకొను బాలునిఁ జేసి మరంద మెట్లు ష ట్పదము గ్రహించు నవ్విధిఁ గృపారసపానము సేయు భాగ్యమున్ హృది పులకింప నా కిడుత శ్రీజలజాసనురాణి వాణియై(1) (1) భాషాశక్తి అయి 185 హృదయము చం. ఎద యొక మల్లె పూ; విదియె యెన్నియొ పాత్రల నిర్వహించుచున్ ముదమున కాటపట్టగును, ముచ్చటయౌ మృదుభావవీచికన్ సదమలవర్ణగంధయుతశాంతిసులక్ష్మము మల్లె, యందుకే కద సుదతీతురుంభముల(1) గౌరవ మెంతొ గడించు నిత్యమున్ (1) ఆడువారి కొప్పులు 186