Menu Close
Kadambam Page Title
అనుభూతుల దొంతరలు
-- మధుప్రియ --

మనిషి జీవితం ఒక మధురం
అది ఎన్నో అనుభూతుల సంగమం

పసిపాపల కేరింతలు ఒక అనిర్వచనీయ అనుభూతి
కలిసి చేసిన తులిపి పనుల జ్ఞాపకాలను
చిన్ననాటి స్నేహితునితో మరల పంచుకోవడం
అదో అధ్బుత శక్తి ప్రసాదం

ఎడబాటు ఎంత ఉన్ననూ
ప్రేమగా పలుకరించే ఒక ఆత్మీయ బంధువు
మనకోసం వేచి ఉన్నారనే భావన నిజమైన నాడు
కలిగిన అనుభూతి అదో అపురూపమైన వజ్రం

కాలంతో పాటు పయనించే మనిషి
వెనక్కి తిరిగి ఒక్కసారి తన
గతం తాలూకు అనుభవాల దొంతరలను
త్రవ్వి చూసుకుంటే
అందులో దొరికిన అంతులేని ఆనందాల స్మృతుల
పునరాగమనాన్ని
ప్రత్యక్షంగా మరోసారి అనుభవిస్తే

అది..

మరో దశాబ్ద కాల
పౌష్టిక ఆహార ఇంధనాన్ని
సమకూర్చి మనిషి ఆరోగ్యాన్ని
ఆహ్లాద సమయాన్ని అందిస్తుంది

అందుకే

అందరం గత స్మృతుల జీవనయానం
మరల పునరావృతం అయ్యే విశ్వాన్ని
పునర్నిర్మించుకుందాం.

Posted in November 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *