అల ------కల ...!!
నువ్వూ ..నేనూ
ఇక స్పష్టత లేని ..
ప్రేమసముద్రమే!
అలలా వచ్చి
నా ..హృదయాన్ని తాకి,
అందుకోలేనంత
ప్రేమను అందించి,
నేను సందిగ్ధంతో
సతమత మవుతున్న
తరుణంలో..
నువ్వే స్పందించి,
నీ హృదయద్వారం
తెరచి..
అత్మీయంగా నన్ను
అహ్వానించావు..!
అక్షరాల మాలిక అల్లి,
అందమైన నీ మెడలో వేసి,
ప్రేమామృతం పంచుకునే
పరమానంద భరిత క్షణాల,
ఎదురుచూపుల్లో..
నన్ను నిరాశకు గురి చేసి,
సంవత్సరాలు..
క్షణాల్లా కరిగించి,
ఆశల పందిరిలోకి తోసి,
పడి లేచిన కెరటంలా,
కంటికి కానరాక..
కనుమరుగైనావు!
ఊహల ఉయ్యాలలో
ఇప్పుడు..
జ్ఞాపకాల..
హరివిల్లువైనావు..!
కలల రాణివై ..
నా ..హృదయంనుండి,
కదలబోనంటున్నావు..!!
అత్యద్భుతమైన వర్ణన సర్. బాగుంది సర్
మంచి భావ కవిత సర్
అల… కల
కవిత చాలా బాగుంది.
dr. Klv. ప్రసాద్ గారికి శుభాకాంక్షలు
అమ్మా..
మీ..స్పందనకు
కృతజ్నతలు
కడలి అలలాంటి మీ కలల రాణి స్మతి కావ్యం బావుంది👌👌👌
ఝాన్సీ గారూ
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
అద్భుతమైన భావ సంద్రం ప్రేమ అలలతో అలరారుతూ..👌👌👌
బాగా వ్రాశారు సర్ .అభినందనలు💐
మాధవి గారూ
మీ స్పందన కు
ధన్యవాదాలండీ .
అల కల వర్ణన బాగుందిసర్ . మీకు అభినందనలు
సాగర్
ధన్యవాదాలు