Menu Close
Kadambam Page Title
ఆనందం అంచున.. అపోహ...!!
-- డా.కె.ఎల్.వి.ప్రసాద్

లాక్ డౌన్ ఎత్తేస్తారట ..
ఈరోజు అక్కడైతే,
రేపు ఇక్కడకావచ్చు
ఆతర్వాత ..ఎక్కడైనాకావచ్చు!

లాక్ డౌన్ ...
క్లోజ్ డౌన్ ఐతే,
ఏమిటట లాభం?
ఏముందట ప్రయోజనం?

జనప్రవాహం సముద్రమయి
రోడ్లమీద ప్రవహిస్తుంది,
షాపు షెట్టర్లు
నాజూగ్గా తెరుచుకుంటాయ్,
లిక్కర్ షాపులు,
తమ 'లక్కు'
పరీక్షించుకుంటాయ్!

ఏదో ...
శిక్ష అనుభవించినట్లు,
స్వేచ్ఛకోసం తపించిపోయినట్టు,
తెలియని ఆరాటం!
విందులు వినోదాలు
తిరునాళ్ల స్ధాయిలో
చిందులు తొక్కుతాయి.
ఇప్పటివరకూ యెడం పాటించిన
శరీరాలు ఇక
భుజం భుజం
రాసుకుంటూ తిరుగుతాయ్!

కరచాలనాలు
మళ్లీ
తెరప్రవేశం చేస్తాయ్!
ఆలింగనాల ...
అపూర్వ సన్నివేశాలు,
ముద్దు ..ముద్దుగా,
హద్దులు దాటిపోతుంటాయ్!

లాక్ డౌన్ ఎత్తేస్తే,
కరోనా పారిపోయినట్టా?
వైరస్ ను తరిమేసినట్టా?
అలాఅనుకుంటే,
పప్పులోకాలేసినట్టే!

కరోనా కొంతకాలం ,
మనమధ్యనే ఉంటుంది,
మనతోకలిసి బ్రతకడానికి
ప్రయత్నంచేస్తూనే,
మనజీవితాలను
మెల్లగా మట్టిలో కలిపేస్తుంది!
అందుకే _
లాక్ డౌన్ లేకున్న
ఉన్నట్టుగానే భావించాలి!
భౌతిక దూరం ప్రాధాన్యత
మరింతగా పెరగాలి.

ఆరోగ్యభధ్రత కోసం
ఆహార నియమాలు పాటించాలి,
పరిశుభ్రతకు పెద్ద పీటవేయాలి!
మానవ జీవనవిధానంలో నవ్యచరిత్రకు
శ్రీకారం చుట్టాలి ...!!

Posted in July 2020, కవితలు

31 Comments

  1. డా కె.ఎల్.వి.ప్రసాద్

    Good morning sir,
    ఆనందం అంచున బాగుంది. ఇంకా కొది గా పొడిగించ వచ్చు. ఇపుడు ఆనందం అంచునే ఉన్నాము.అది దా టితే పాతాలనికి పడి పోవటంమే. అందరం అంచునే ఉన్నాము.

    ___కె.రమేశ్
    కౌన్సిలర్
    ఏరియా ఆసుపత్రి
    మహబూబాబాద్

  2. BILLA JANIBASHA

    కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నప్పటికీ ఇంకా కొంతమంది ప్రజల్లో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది సార్, కనీసం ఓ 30% ప్రజలు మాస్క్ కూడా ధరించలేదు సర్.

  3. మొహమ్మద్ అఫ్సర వలీషా

    సమాజ యోగ్యమైన కవిత సార్ లాక్ డౌన్ ఎత్తేసినా కరోనా పోలేదన్న సత్యాన్ని ప్రజలు గ్రహిస్తే కేసులు అన్ని పెరగవు .అవసరం ఉన్నా లేకపోయినా సరదా సరదాగా తిరుగుతూ అంటిస్తున్నారు.ప్రజల్లో అవగాహన లేకపోతే ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది .మీచావు మీరు చావండని చేతులెత్తేసింది.మంచి స్ఫూర్తి దాయక కవిత వ్రాశారు సార్ హృదయపూర్వక అభినందనలు మీకు 👏👏👏👏🎍👌🎍👌🎍👌🎍🙏🙏🙏🙏
    మొహమ్మద్ అఫ్సర వలీషా
    ద్వారపూడి (తూ గో జి )

  4. డా.అన్నావఝ్జుల మల్లికార్జున్.

    లాక్ డౌన్..అంటే ఏమిటో,ఎందుకో చెప్పి చూపించారు..ఆ నాలుగు రోజులు భయంగానే ఇళ్లలో ఉన్నాం.కుడి చేయి ఎడమ చేయిని నమ్మనంత.ఆ తర్వాత చావులెక్కలను రోజురోజుకూ లెక్కిస్తూ..తాను పాటించాల్సిన నియమాలను పాటించకుండా,రేఖను దాటుతూనే ఉన్నాడు..
    ఇక నా వరకు వస్తే..!అవసరానికి మించే చేతుల శుభ్రత,వ్యక్తి దూరం పాటిస్తున్న.ఓ కాలు రేఖకు అవతలకూడా పెడుతున్న..తప్పనపుడు.
    అపొహల అంచున ఆనందాన్ని దూరం చేసుకోకుండా.!

  5. Dr.Harika

    We must follow the rules to protect ourselves and others too! And it’s great if someone think about their family safety and follow the safety precautions as when can’t change the situation out there.
    Thanks for reminding them to all of us sir.

  6. Sridhar reddy

    ఆల్రెడీ పర్యావసానాలు అనుభవిస్తున్నాం …
    ప్రజలు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి …

  7. రాయవరపు సరస్వతి

    డా, ఎల్.వి.ప్రసాద్ గారు చెప్పినట్లుగా

    కరోనా మహమ్మారిని ఎవరికి వారే పారద్రోలాలి,

    రాయవరపు సరస్వతి

  8. Jhansi koppisetty

    Excellent message oriented poem👌👌👌…
    Need of the hour Sir 👍👍👍…
    కాకపోతే చదువుకున్న అజ్ఞానుల ముందు కంఠ శోషేనేమో😢😢😢

  9. Rajendra Prasad

    కొంత కాలం, ఇంకొంత కాలం మన మధ్యనే దాగుంటుంది.

    కవితలో సమాజ పోకడ, ప్రజలకు హెచ్చరిక చేశారు సరే. పాపం పరిపాలకులన్ వదిలి వేసి తిరేమి కవి వర్యా? కవిత బాగుంది సర్.

  10. sagar

    మంచి పోష్ట్ సర్ . నిర్లక్షంగా తిరిగే వారి బాద్యత గుర్తుచేసే పోష్ట్ .

  11. చిట్టె మాధవి

    నిజమే సర్…జనం అవసరం లేకున్నా వేలం వెర్రిలా రోడ్లపై కనిపిస్తున్నారు..
    మంచి కవిత సర్…నీడెడ్ అండ్ గుడ్ పోస్ట్.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!