సీ.
ఎదుటి వారింటికి నేఁగ వాహన మెక్కి
............తిన్నఁగా వాకిట దిగును గాని
నాలు గడుగులు వైచి నడవడు బొజ్జను
............పెంచి వైద్యుల పంచ వేచి వేచి
తలనొప్పి కైనను తనువెల్లఁ దనిఖీలు
............చేయించుకొని డబ్బు చెల్లఁగొట్టి
కూర్చున్న లేవక కోరినవెల్ల ‘రి
............మోటు కంట్రోలు’ పై వాటముగను
............తిన్నఁగా వాకిట దిగును గాని
నాలు గడుగులు వైచి నడవడు బొజ్జను
............పెంచి వైద్యుల పంచ వేచి వేచి
తలనొప్పి కైనను తనువెల్లఁ దనిఖీలు
............చేయించుకొని డబ్బు చెల్లఁగొట్టి
కూర్చున్న లేవక కోరినవెల్ల ‘రి
............మోటు కంట్రోలు’ పై వాటముగను
తే.గీ.
శ్రుతులు పలికించు గతి నొక్కి చూచుఁ గాని
లేచివెళ్ళడు ప్రకృతి పిల్చినను గాని;
యిట్టి నవమానవునిఁ జూచి సృష్టికర్త
మందహాసంబు సేయఁడే మఱల మఱల? 1
లేచివెళ్ళడు ప్రకృతి పిల్చినను గాని;
యిట్టి నవమానవునిఁ జూచి సృష్టికర్త
మందహాసంబు సేయఁడే మఱల మఱల? 1
సీ.
చరవాణియంత్రాల శ్రవణపుటంబుల
ధరియించి లేచిన తరుణ మాది
వీడక పనులెల్ల విభ్రమం బగునట్టి
ద్వ్యవధానప్రక్రియ(1) కంకితమయి
ప్రకృతి పిల్చినఁగూడఁ బ్రక్కనఁబెట్టి త
రంగశృంఖలితాంతరంగు(2) లగుచు
వాహనచోదనవ్యాహ్యాళులను బిచ్చి
పట్టినరీతి సంభాషణములె
ధరియించి లేచిన తరుణ మాది
వీడక పనులెల్ల విభ్రమం బగునట్టి
ద్వ్యవధానప్రక్రియ(1) కంకితమయి
ప్రకృతి పిల్చినఁగూడఁ బ్రక్కనఁబెట్టి త
రంగశృంఖలితాంతరంగు(2) లగుచు
వాహనచోదనవ్యాహ్యాళులను బిచ్చి
పట్టినరీతి సంభాషణములె
తే.గీ.
జీవితధ్యేయ మనఁ జేయు సేవ; కంఠ
పట్టికలు(3) లేక నిలువఁగా భారమైన
తలలఁ గాన్కగ నీయ వైద్యప్రపంచ
మెంత రోదించినన్ విన రీదినంబు 2
............(1) రెండు పనులు ఒకేసమయంలో చేసే విధానము
............(2) సెల్ ఫోన్ తరంగాలతో బంధింపఁబడిన హృదయాలు కలవారు
............(3) మెడకు సంబంధించిన స్పాండిలైటిస్ కి వాడే ఉక్కు కాలర్లు
పట్టికలు(3) లేక నిలువఁగా భారమైన
తలలఁ గాన్కగ నీయ వైద్యప్రపంచ
మెంత రోదించినన్ విన రీదినంబు 2
............(1) రెండు పనులు ఒకేసమయంలో చేసే విధానము
............(2) సెల్ ఫోన్ తరంగాలతో బంధింపఁబడిన హృదయాలు కలవారు
............(3) మెడకు సంబంధించిన స్పాండిలైటిస్ కి వాడే ఉక్కు కాలర్లు
తే.గీ.
ఎవరితో మాటలాడునో యెవరి కెఱుక?
నిన్నె బంధింపఁ జిత్రాన నీ కెఱుకయె?
పైన నద్దాని నెట వాడుఁ బరమశివుఁడు
కూడఁ దెలియంగ నోపఁడు కువలయమున 3
నిన్నె బంధింపఁ జిత్రాన నీ కెఱుకయె?
పైన నద్దాని నెట వాడుఁ బరమశివుఁడు
కూడఁ దెలియంగ నోపఁడు కువలయమున 3
తే.గీ.
దొప్పల నమర్చెఁ జెవులకు దూరశబ్ద
గ్రహణసౌకర్య మిడ ధాత, కాని దూరి
చెవుల లోలోపల ధ్వనించు చిత్రసూక్ష్మ
పరికరమ్ములతో(1) నవి వ్యర్థమయ్యె 4
............(1) ఇయర్ ఫోన్లు
గ్రహణసౌకర్య మిడ ధాత, కాని దూరి
చెవుల లోలోపల ధ్వనించు చిత్రసూక్ష్మ
పరికరమ్ములతో(1) నవి వ్యర్థమయ్యె 4
............(1) ఇయర్ ఫోన్లు
కం.
ఇది ప్రగతి యగునొ కాదో?
తుద కీ యవయవము లన్ని తోరపుమార్పుల్
పదపడి చెందునొ చెందవొ?
యదియె విధాతకుఁ బరీక్ష యగుఁగా నింకన్ 5
తుద కీ యవయవము లన్ని తోరపుమార్పుల్
పదపడి చెందునొ చెందవొ?
యదియె విధాతకుఁ బరీక్ష యగుఁగా నింకన్ 5
సూర్యనారాయణమూర్తి గారు చాలా చాలా బాగుంది.కృతఙతలు.