Menu Close
వరలక్ష్మీప్రార్థన
- అయ్యగారి సూర్యనారాయణమూర్తి -
రవికాంతము    వరలక్ష్మీకరకంకణనిస్వనభాగ్యము నొందిన శ్రోత్రములున్
                    హరివక్షస్స్థితకనదానన్యశుభాకరవిగ్రహఁ గాంచు కనుల్
                    సురరాజస్తుతహేమకలాపసుశోభితసుందరధామ(1) రమన్ 
                    నిరతంబున్ భజియించు మనంబుఁ బునీతములై తరియించుఁ గదా
                         (1) విష్ణుపురాణములో ఇంద్రుడు చేసిన లక్ష్మీ స్తోత్రము చాల ప్రసిద్ధము

కం. రక్షణలక్షణవీక్షణ!
      పక్షిగమా!(1) లోకకుక్షి! వల్లభవిష్ణో
      రీక్షణలక్ష్య! కటాక్షని
      రీక్షణ యీక్షణమె తొలఁగ నీక్షింపు మమున్ 
          (1) లక్ష్మీదేవి వాహనము గుడ్లగూబ

తే.గీ. చేతులెత్తినమస్కరించెదను మాత! 
        సింధుతనుజాత! వరదాత్రి! శేషశాయి 
        యురమునందున వసియించి యుజ్జ్వలించు 
        నిన్నుఁ జూచిన కన్నులే కన్నులమ్మ!

కం. కరుణించి చూడు తల్లీ! 
      కర మనురక్తిని శుభాలు గలుగఁగ నిఁక సు
      స్థిరమగు భాగ్యము లబ్బఁగ
      పరులను నే వేఁడఁజాల భార్గవపుత్రీ!
Posted in August 2018, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *