Menu Close
Kadambam Page Title
మౌనం తోటలోకి
-- డి.నాగజ్యోతిశేఖర్ --

మాటకు గాయమైంది
మనస్సు దుఃఖపు లోయ అయ్యింది

కొండ చివర వేళ్ళాడుతూ
అప్పుడెప్పుడో చెప్పుకున్న ఊసులు

నీళ్ల అడుగున చేరి
కన్నీటిని దాచుకుంటున్న
జ్ఞాపకాల చేపపిల్లలు

మైదానపు అంచుల్లో
నేల రాలిన ఆకుపచ్చ పాట

రెప్పల ఆకాశం నుండి
చప్పుడు చేయక కుప్పకూలిన కలలు

గుండె
మౌనం తోటలోకి ప్రవేశించాక...

పూల నవ్వుల్ని
నిశ్శబ్ద శిశిరం కమ్మేస్తుంది
ఎప్పటి వేదనో
తుమ్మెదల ఝమ్ కారాన్ని
వెలివేస్తుంది

తోటమాలి తవ్విన గాయం
పచ్చిగా మెదులుతూ
మట్టి స్వరం మూగబోయి
మాట పెగలనట్టుంది

Posted in November 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *