Menu Close
Kadambam Page Title
హిమగిరి సొగసులు
-- ఏ.అన్నపూర్ణ --

శిశిరం ప్రవేశిస్తూంది, గడిచిన కాలం లోని ఆకుపచ్చదనం మాయమైంది
పర్వతాలు మెల్లగా మంచుతెరలను దుప్పటిగా కప్పుకుంటున్నాయి
దట్టంగా కురుస్తున్న మంచు నింగిని నేలను ఏకంచేసింది
అప్పుడప్పుడు అరుదుగా కనిపించే ఉదయభానుడి కిరణాల వేడికి
కరుగుతున్న మంచు రకరకాల ఆకృతులతో శిల్పాలు నిర్మించింది
చలికి గజగజ వణుకుతూ కూడా హిమ సౌందర్యాన్ని ఆస్వాదించే
ప్రకృతి ప్రేమికులు, పర్యాటకుల సందడి మొదలైంది.
తరలి వస్తున్నారు ఎందరో,
మంచు అందాలను ప్రత్యక్షంగా అనుభూతి చెందడానికి
చలిని లెక్కచేయని ధైర్యవంతులు ప్రకృతి ఒడిలో పరవశించి పోతారు.
వెచ్చని ఎయిర్ కండిషన్ రెస్టారెంట్లో అద్దాలనుంచి వీక్షిస్తూ మురిసిపోతారు మరికొందరు
ఘుమ ఘుమలాడే స్టార్ బక్స్ కాఫీ తాగుతూ సేదదీరడం
అదో మాటలకందని మధురానుభూతి.

వెండిపూత పూసినట్టు సూర్యకిరణాలు పడిన మంచు పర్వతాలు
బంగారు రంగుతో మెరిసిపోతుంటే ఆ అందానికి ''ఫిదా''కావలసిందే
ఎన్నిసార్లు చూసినా తనివితీరదు మనసంతా ఉత్సాహంతో ఉరకలు వేస్తుంది .

అమెరికా వాషింగ్టన్ రాష్ట్రం లోని బెల్లింగ్హం కి ౩౦ మైళ్ళదూరంలో ''మౌంట్ బేకర్ ''అనే పర్వతాలు వింటర్లో స్కేటింగ్ చేసేవారికి ప్రియమైన ప్రదేశం. పర్యాటకులకు కనువిందు చేస్తుంది. తిరిగి రాబుద్ధికాదు.
వేసవికాలం వచ్చినా అక్కడక్కడా మంచు అలాగేవుంటుంది. పూర్తిగా కరిగిపోదు. ఎప్పుడు పచ్చగా వుండే పైన్ ట్రీస్ మంచులో ఠీవీగా తలెత్తుకుని అందాలతో ఆకట్టుకుంటాయి. కరిగినమంచు చెరువులుగా ఏర్పడి అందాలకు నెలవులుగా మురిపిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు నాలో కలిగిన స్పందన ఈ కవిత.

Posted in September 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *