జర్మనుల ఆరాధ్య దైవం,"దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారు"
మన దౌర్భాగ్యం ఏమిటి అంటే మనవాడి ప్రతిభను పక్కవాళ్ళు గుర్తించి చెప్పేదాకా మనం గుర్తించం. మొదటి నుండి జర్మనులకు సంస్కృతం అంటే ఎక్కువ అభిమానం. వారు సంస్కృతాన్ని భారతీయ వేద పండితుల ద్వారా నేర్చుకునేవారు. వారికి చాల రకాలుగా సహాయము చేసిన సంస్కృత పండితులలో ముఖ్యుడు దండిభట్ల విశ్వనాధ శాస్త్రి గారు. దండిభట్ల విశ్వనాధ శాస్త్రి గారి పేరు లేదా ఆయన ఫోటో లేదా ఆయన స్మారక చిహ్నం భారత దేశములో ఎక్కడ కనిపించదు. మనం మరచిపోయింది వేదాలని కాదు, ఒక మహాజాతి వైభావాన్ని కూడ. ముఖ్యముగా ఆయన తెలుగు వాడు అయినప్పటికీ ఆయన గురించి, ఆయన ఘనత గురించి ఎక్కడ పుస్తకాల్లో ప్రస్తావించబడలేదు, ఆయన పేరు తెలుగు వారికి పూర్తిగా పరిచయం లేనిది. కానీ ఆయన హిట్లర్ కాలం నుండి జర్మనులకు దేవుడితో సమానము. ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న టైమ్ లో ఒక భారతీయ దౌత్య వేత్త జర్మనీ వెళ్ళినప్పుడు శాస్త్రి గారి ఫోటో అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు. ఎవరు, ఏమిటి అని అడిగితే మీ భారతీయుడు మీకు తెలియదా అని ఆ జర్మనీ అధికారి ప్రశ్నిస్తే, భారతీయ దౌత్య వేత్త తెల్ల మొహం వేసాడు. భారత దేశము తిరిగి వచ్చిన ఆ అధికారి ఈ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పటికీ జర్మనీ లోని ఫ్రాంక్ ఫర్ట్ విశ్వ విద్యాలయములో ఆయన ఫోటో ఉన్నది.
దండిభట్ల విశ్వనాథశాస్త్రి గారు జర్మనులకు ఎలా ఆరాధ్య దైవం అయినాడో తెలుసుకుందాం. వేదాలు సమస్త జ్ఞానానికి మూలం అని విదేశీయులు చెబుతున్నారు. జర్మనులకు ప్రియమైన పండితుడు శ్రీ బ్రహ్మశ్రీ దండిభట్ల విశ్వనాధ శాస్త్రి గారు. ఎలా జర్మనులకు ప్రియమైన వాడుగా అయినారో తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసినాక ప్రపంచ వ్యాప్తముగా ఆర్ధిక మాంద్యం ఏర్పడింది. హిట్లర్ కు ప్రపంచ జాతులలో జర్మనులు గొప్ప జాతి అని జర్మనులు ప్రపంచం పై ఆధిపత్యాన్ని చెలాయించాలి అని జర్మనులలో దేశభక్తిని ప్రేరేపించి తన మార్గములోకి తెచ్చుకున్నాడు. ప్రపంచము పై ఆధిపత్యం సంపాదించాలి అంటే శక్తివంతమైన మారణాయుధాలు కొత్తవి తయారు చేసుకొని ఇతర దేశాలపై యుద్దాలు చేసి జర్మనుల ఆధిపత్యమును ప్రదర్శించాలి. భారతీయ వేదాలలో మారణాయుధాల రహస్యాలు ఉన్నాయని గ్రహించిన హిట్లర్ వాటిని విడమరచి చెప్పగలిగిన వేద పండితుల కోసం అన్వేషణ ప్రారంభించాడు. రాజమండ్రి ప్రాంతంలో అటువంటి పండితులు ఉన్నారని తెలుసుకొని వారిని జర్మనీ ఆహ్వానించి వారిచే వేదాలలో ఉన్న విధముగా రాకెట్లు, బాంబులు తయారు చేయించు కోవాలని ఆలోచన కలిగింది.
విశ్వనాథ శాస్త్రి గారు రాజమండ్రికి చెందిన గొప్ప వేదపండితుడు మరియు గొప్ప వ్యాకరణ పండితుడు. ఒక్క యజుర్వేదం నాలుగు ముఖాలు నాలుగు రూపాల్లో అవగతమవుతుంది, ఇన్ని విధాలుగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తికీ ఈ నాలుగు శాస్త్రాల్లో ప్రవేశం ఉండాలి. విశ్వనాధ శాస్త్రి గారికి అంత ప్రతిభ ఉండబట్టే ఆయనను 1938 ప్రాంతములో వీరిని జర్మన్ శాస్త్రవేత్తలు జర్మనీకి ఆహ్వానించారు. వారికి యజుర్వేదం, మరియు అధర్వణ వేదములలో లోని సంస్కృత శ్లోకాలకు అర్ధం తెలుసుకోవాలి. శాస్త్రిగారు సంస్కృత భాషలోను వేదాలలో మంచి దిట్ట కాబట్టి ఆయన సహకారము వారికి పనికి వస్తుంది అని హిట్లర్ తో చెప్పి ఆయన చేత జర్మనీకి ఆహ్వానించబడ్డారు. వేదాలలో ఉన్న విషయం ఆధారంగా బాంబుల తయారీ, నిలవల గురించి తెలియపరచడం, బాంబు లాంటి వాటిని అవి నష్టపోకుండా నిల్వ ఉంచే ఒక శాస్త్రీయ పద్ధతిని జర్మనీ వారికి పరిచయం చేసిన వ్యక్తి మన రాజమండ్రి కి చెందిన విశ్వనాధ శాస్త్రి గారు. విశ్వనాధ శాస్త్రి గారు రాబోయే యుద్దానికి ముందుగా ఆయుధాలు సమకూర్చుకోవాలనే హిట్లర్ ఆలోచన, వేదాల సహాయముతో వేద శాస్త్ర పండితుడైన విశ్వనాధ శాస్త్రి గారి సహాయముతో యుద్ధ క్షిపణులు, రెండవ ప్రపంచ యుద్దానికి ముందు డిజైన్ చేయించుకొనే వారు.
విశ్వనాధ శాస్త్రి గారు బాల్యము నుండే తర్క, వ్యాకరణ, మీమాంస శాస్త్రాలను అధ్యయనం చేసి యజుర్వేదములోని కర్మ కాండ భాగాన్ని అధర్వణ వేదంలోని మంత్ర ప్రయోగ భాగాన్ని క్షుణ్ణముగా అభ్యసించాడు. విశ్వనాధ శాస్త్రి గారు లౌకిక విషయాలను పట్టించుకోకుండా నిత్యం శాస్త్ర విషయాలను ఆలోచిస్తూ ఇంటికి వచ్చిన వారితో చర్చిస్తూ ఉండేవాడు. ఈయన ప్రతిభ తెలుసుకున్న హిట్లర్ ప్రతినిధులు ఆయన కోసం అన్వేషణ ప్రారంభించారు. ఒక రోజు ఆయన విశాఖ పట్నం సమీపాన ఉన్న కొత్త వలస దగ్గర గల పల్లెటూరుకు వెళ్ళవలసి వచ్చింది. జర్మనులు ఆయనను ఆ పల్లెటూరు నుండి విశాఖ పట్టణానికి అక్కడ నుండి కలకత్తాకు తీసుకువెళ్లారు. అక్కడ నుండి ఆయనను ఒప్పించి జర్మనీ తీసుకు వెళ్లారు. ఆయన జర్మనీ చేరుకున్న సమయం రెండో ప్రపంచ యుద్దానికి రంగం సిద్ధం అవుతున్న సమయం.
తయారు చేసిన బాంబులను రాసులుగా నిల్వ చేసే సమయంలో ఏ మాత్రం ఒత్తిడి కలిగినా అవి పేలిపోతూ ఉండేవి. అవి పేలకుండా నిల్వ చేసే మార్గం జర్మనులకు తట్టలేదు. విశ్వనాధ శాస్త్రి గారు యజుర్వేదం నుండి ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించారు. దాంతో అయన పేరు జర్మనీ లో మారు మోగిపోయింది. జర్మనులకు ఆయన ఆరాధ్యుడైనాడు. ఆ విధంగా ఆయన శాస్త్ర పాండిత్యాన్ని జర్మనులకు పంచి పెట్టాడు. జర్మనీ అభివృద్ధి చెందిన దేశముగా మారడానికి ఆయన శాస్త్ర పరిజ్ఞానం ఎంతగానో ఉపయోగ పడింది. జర్మనీకి వెళ్లిన శాస్త్రిగారు మళ్ళీ భారతదేశానికి తిరిగి రాలేదు. ఆయన జర్మనీలో ఉన్నంతకాలం వారి సతీమణికి నెలకు మూడు వందల రూపాయలు అందేవి. ఆ తరువాత నెలకు తొంభై రూపాయల చొప్పున ఆవిడ జీవించినంత కాలం ముట్టేవి. బహుశా అది కుటుంబ ఫించను అయి ఉంటుంది. ఆయన పరమపదించి ఉంటారని ఆయన సన్నిహితులు భావించారు. ఆవిధముగా భారతీయ అందునా తెలుగువాడైన వేద పండితుడు జర్మనీలో తనువు చాలించారు. నేటికీ జర్మనులు ఆయనను ఆరాధ్య దైవంగా పరిగణిస్తున్నారు.
Very interesting and revealing too. Thank you.