జంటస్వరస్వాగతము
తే.గీ. ఏకవర్గంబు(1), రెండింటి హెచ్చవేత(2),
మూఁడు వర్గాల కూడిక(3), మొట్టమొదటి
నవఘనంబుల కలయిక(4), నవ్యమైన
యాంగ్లవత్సరమా! స్వాగతాంజలు లివె
భావము-
గణితస్వరము-
(1) [45x45]
(2) [9x9]X[5x5]
(3) [40x40]+[20x20]+[5x5]
(4) [1x1x1]+[2x2x2]+[3x3x3]+……..+[9x9x9]
కవనస్వరము-
(1) మానవు లందఱు ఒకే జాతి (2) బుద్ధి, సిద్ధి ఒకదానిని ఒకటి ఎక్కువచేయుట
(3) బాగా పెరిగిన ఉత్పాదనలు, విక్రయాలు మఱియు సంపాదనలు కలిసి
(4) ప్రారంభము నుండి క్రొత్త గొప్పతనాల సాంగత్యము
[ఈ కవితలో ‘వర్గము’ మఱియు ‘ఘనము’ అనే పదాలు ద్వ్యర్థిపదాలుగా ప్రయోగింపబడ్డాయి]
అద్భుతమైన వర్ణన,వివరణ.గణితమును, ప్రస్తుత స్థితి నుంచి తెలియజేశారు.