
అలుముకున్న చీకటిలో కాంతిరేఖ కోసం వెదుకుతువుంటే
ఎవరికోసం నీ ఎదురు చూపు అంటూ నామనసు మేలమాడింది.
తెలతెలవారుతుంటే పక్షులు, కిలకిలారావాలతో సందడి చేస్తుంటే
రాత్రంతా నిద్రలేని రేరాణి కలవరంతో కళ్లుతెరచి చూసింది.
నీకోసమే కలలుకంటున్న కలువబాల, మబ్బులుకమ్మిన ఆకాసాన్ని చూసి
నిరాశతో నీటిలో తలదాచుకుంటూ రేపటి రోజుకోసం ఆశతో ఎదురు చూస్తోంది .
హేమంతంలో మంచుతెరలు కమ్మి వెల వెల బోయిన సూర్యుడు
చెరువులోని కమల చెలిని కానరాక దిగులుతో కనుమరుగయ్యాడు.
చలిచలి గాలులతో మంచుపూలు కురియగా సమయం తెలియని రోజులు
బద్ధకంగా గడిచిపోతుంటే వెచ్చని సూరీడు కోసం తహతహ లాడుతున్నా.
మంచుతెరలు కప్పిన ఇళ్ళకప్పులు చెట్టు కొమ్మలపై కూర్చిన ముత్యాలు
తెలుపే కానీ మరోరంగు కనిపించక మురిపించే శీతల ప్రాంతంలో అందాలు ఎన్నో.
చీకటిలో వెలిగే దీపాలు పొగమంచులోఆవిరులు ఇంటింటా పెయిన్ట్రీ అలంకారాలు
గడ్డకట్టే చలిలో కుటుంబం అంటా కలిసి జరుపుకునే క్రిస్మస్ పండుగ పార్టీలు.
ఎప్పుడూ ఓకే పండుగలు, పూజలు, అలంకారాలు పద్ధతులు కాకుండా
సర్వ మానవ సౌభాతృత్వాన్ని పంచుకుందాం కొన్నిపండగలు అయినా కలిసి జరుపుకుందాం!