Menu Close
Lalitha-Sahasranamam-PR page title

షోడశోధ్యాయం

(శ్రీమాత విరాడ్రూప షోడశకళల వర్ణన)

శ్లోకాలు: 137-152/1, సహస్రనామాలు: 701-800

760. ఓం త్రివర్గదాత్ర్యై నమః
ధర్మార్థకామాలనే త్రివర్గాలనూ ప్రసాదించునట్టి జననికి ప్రణామాలు.


761. ఓం సుభగాయై నమః
పంచవర్షప్రాయ అయిన కన్యను సుభగ--అంటారు. అట్టి కన్యామూర్తికి ప్రణామాలు.


762. ఓం త్ర్యంబకాయై నమః
త్రిమూర్తుల జననీ స్వరూపిణియై లోకాలను పాలించు తల్లికి వందనాలు.


763. ఓం త్రిగుణాత్మికాయై నమః
సత్త్వరజస్తమో రూపిణికి ప్రణామాలు.


764. ఓం స్వర్గాపవర్గదాయై నమః
స్వర్గ, మోక్షాలను ప్రసాదించు మాతృదేవతకు ప్రణామాలు.


765. ఓం శుద్ధాయై నమః
శుద్ధ స్వరూపిణి కి ప్రణామాలు.


766. ఓం జపాపుష్ప నిభాకృత్యై నమః
జపాపుష్ప సమకాంతిగల మాతృమూర్తికి నమస్కారాలు.


767. ఓం ఓజోవత్యై నమః
తేజస్స్వరూపిణికి ప్రణామాలు.


768. ఓం ద్యుతిధరాయై నమః
ద్యుతిని-- కాంతిని ధరించిన కాంతిమయ స్వరూపిణికి వందనాలు.


769. ఓం యజ్ఞరూపాయై నమః
యాగ స్వరూపిణికి నమస్కారాలు.


770. ఓం ప్రియవ్రతాయై నమః
సమ‌స్త వ్రతాలయందు ప్రీతి అంటే యిష్టంకల మాతకు ప్రణామాలు.


771. ఓం దురారాధ్యాయై నమః
దురాత్ములు ఆరాధించుటకు వీలుకాని మహేశ్వరికి వందనాలు.


772. ఓం దురాధర్షాయై నమః
దురాత్ములకు ప్రసన్నం కాని మాతకు వందనాలు.


773. ఓం పాటలీకుసుమ ప్రియాయై నమః
పాటలీపుష్పమంటే ప్రీతికల మాతకు వందనాలు.


774. ఓం మహత్యై నమః
గొప్పదైన తల్లికి వందనాలు.


775. ఓం మేరునిలయాయై నమః
సుమేరుగిరి నిలయస్థానంగాగల మాతకు ప్రణామాలు.


776. ఓం మందారకుసుమ ప్రియాయై నమః
మందారపూవు అంటే యిష్టముకల లలితా మాతకు నమస్కారాలు.


777. ఓం వీరారాధ్యాయై నమః
వీరులచే ఆరాధించబడునట్టి తల్లికి ప్రణామాలు.


778. ఓం విరాడ్రూపాయై నమః
విరాట్ స్వరూపిణికి నమస్కారాలు.


779. ఓం విరజాయై నమః
విరజా స్వరూపిణికి వందనాలు.


780. ఓం విశ్వతోముఖ్యై నమః
విశ్వమంతా వ్యాపించిన సర్వతోముఖ స్వరూపిణికి ప్రణామాలు.


781. ఓం ప్రత్యగ్రూపాయై నమః
ప్రత్యగాత్మ--అంతరాత్మ స్వరూపిణికి అంజలులు.


782. ఓం పరాకాశాయై నమః
పరాకాశమంటే --పరబ్రహ్మ-- అట్టి స్వరూపంకల మాతకు వందనాలు.


783. ఓం ప్రాణదాయై నమః
ప్రాణశక్తిని ప్రసాదించు వర్థిల్ల జేయు శక్తి స్వరూపిణికి ప్రణామాలు.


784. ఓం ప్రాణరూపిణ్యై నమః
ప్రాణశక్తి స్వరూపిణికి నమస్కారాలు.


785. ఓం మార్తాండ భైరవవారాధ్యాయై నమః
మార్తాండ భైరవుని చేత కూడ ఆరాధింపబడిన మాతకు ప్రణామాలు.


786. ఓం మంత్రిణీ న్యస్తరాజ్యధురే నమః
మంత్రిణీ శక్తి యందు గల రాజ్యభారం కల మాతకు వందనాలు.


787. ఓం త్రిపురేశ్యై నమః
త్రిపుర నాయికా స్వరూపిణికి వందనాలు.


788. ఓం జయత్సేనాయై నమః
జయమే లక్ష్యంగా గల సేన గల లలితా మాతకు ప్రణామాలు.


789. ఓం నిస్త్రైగుణ్యాయై నమః
త్రిగుణాతీత మూర్తికి వందనాలు.


790. ఓం పరాపరాయై నమః
పరాస్వరూపిణియు, అపరాస్వరూపిణియు అయిన మాతకు వందనాలు.

----సశేషం----

Posted in May 2024, ఆధ్యాత్మికము

1 Comment

  1. గంగిశెట్టి లక్ష్మీనారాయణ

    771 వ నామం : దూరారాధ్యాయై నమః = దురాత్ములచే కూడా ఆరాధించగలిగే తల్లీ నమస్సులు -అని చెప్పాలి.. లేదా, ఆరాధించుటకు మిక్కిలి కష్టమైన తల్లీ, నమస్సు అని పేర్కొవాలి. cf. వీరారాధ్యాయై నమః అనే 777 నామ వివరణ చూడండి.. అక్కడ ఎలా అర్థ వివరణ ఉందో, ఇక్కడా అలాగే ఉండాలి కదా! దురాత్ములు ఆరాధించినంత మాత్రాన, ఆ యమ్మ వారికి ప్రసన్నమౌతుందా? కాదని 772 నామం దురాధర్షాయై నమః అనే మాట స్పష్టం చేస్తోంది కదా!

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!