విరహం!
చెలీ! నా ప్రియ సఖీ! నీ విరహం నన్ను రగిలిస్తున్నది. నీవు లేక జీవించ లేను. ఇంకా ఎన్నాళ్ళిలా ఒంటరిగా? జాలే లేదా నాపై ప్రియా? నీవు లేని ఈ బ్రతుకుకి అర్ధం లేదు. నీవు లేని ఈ జీవితం వ్యర్ధం. నా కెందుకీ వ్యధా పూరిత జీవనం? దేవుళ్ళెంత స్వార్ధపరులో కదా! తన వంట్లో సగం చేసుకున్నాడు- ఇష్ట సఖిని, ఒకాయన! తన గుండెలో దాచేసుకున్నాడు- ప్రియ సఖిని, మరొకాయన! తన నాలుకపైనే ఉంచేసుకున్నాడు - భార్యామణిని, విరహం భరించలేక, ఇంకో ఆయన! మరి మనకు మాత్రం ఎందుకీ --- మరిగే వేదన? మానవుల మైనందుకా? అందుకే మనమూ - కాయం వదలి, గాయం మాన్పు కుందాం! ఒకరిలో ఒకరం శాశ్వతంగా కల్సిపోదాం. ఆ దేవుళ్ళను వెక్కిరిస్తూ విరహమే లేక ఉండిపోదాం.