విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా...
చిత్రం: బందిపోటు దొంగలు (1968)
సంగీతం: పెండ్యాల
గేయ రచయిత: డా. సి. నారాయణ రెడ్డి
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా...
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...
విన్నానులే ప్రియా...
చరణం 1:
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే..ఏ..ఏ..
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే..
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే...ఒదిగి ఉన్నావులే..
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...
విన్నానులే ప్రియా...
చరణం 2:
వికసించి వెలిగే నీ అందము...ఒక వేయి రేకుల అరవిందము..
వికసించి వెలిగే నీ అందము...ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు.. కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే... నిండి ఉన్నావులే..
విన్నానులే ప్రియా.. కనుగొన్నానులే ప్రియా..
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...ఏ..ఏ..
విన్నానులే ప్రియా...
చరణం 3:
చిరుగాలి వీచెను వింజామర..గగనాలు వేసెను విరి ఊయల
ఆ..ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
చిరుగాలి వీచెను వింజామర..గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ పసిడి పందిళ్ళలో మనకి పరిణయమౌనులే... పరిణయమౌనులే...
విన్నానులే ప్రియా... కనుగొన్నానులే ప్రియా...
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...ఏ..ఏ...ఏ...
విన్నానులే ప్రియా... ఆ...