భావనా ప్రధానమైన వాక్యాల సంయోగం ఒక పాటను ఎంతో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అటువంటి పాటలకు బాణీలు కట్టి చిత్రీకరించిన విధానం ఆ పాటకు మరో అద్భుత రూపం కల్పించి ప్రేక్షకుల మన్నలను పొంది వారి హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆ చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉంటాయి.
తెలుగు సినీ పరిశ్రమ మొదలైన నాటినుండి ఎంతోమంది గేయ రచయితలు అత్యద్భుతంగా పాటలను రచిస్తూ, మాతృభాష మాధుర్యాన్ని ఎంతో భావయుక్తంగా పదవల్లరులతో ప్రయోగాలు చేసి మనందరి మనోల్లాసానికి కారణమౌతున్నారు. అటువంటి గొప్ప సినీ గేయ రచయితల పంక్తిలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది, సాహిత్య పటిమను కలిగి తెలుగు సినీ రంగంలో మరియు భాషాభిమానుల హృదయాలలో సముచిత స్థానాన్ని సముపార్జించుకున్న శ్రీ సిరివెన్నల సీతారామ శాస్త్రి గారి కలం నుండి జాలువారిన ఈ అద్భుత గేయం మీ అందరికోసం అందిస్తున్నాము.
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆదిప్రణవనాదం ఓం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
ఆ ఆ ఆ
సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది
సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్ధిష వీణియ పైన దినకర మయూఖతంత్రుల పైన
జాగృత విహంగతతులె వినీల గగనపు వేదికపైన
ప్రాగ్ధిష వీణియ పైన దినకర మయూఖతంత్రుల పైన
జాగృత విహంగతతులె వినీల గగనపు వేదికపైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి
జగతికి శ్రీకారము కాగ విశ్వకార్యమునకిది భాష్యముగ
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు
హృదయ మృదంగ ధ్వానం
అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగ
సాగిన సృష్టి విలాసమునే
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్ఛ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వర శురచరీ గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం