Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు కేదారి -
ఈశావ్యాస్యోపనిషత్తు

గత సంచిక తరువాయి... »

పదహారవ మంత్రం

పూషన్నేకర్షే యమ సూర్య ప్రాజాపత్య
వ్యూహ రశ్మీన్ సమూహ
తేజో యత్తే రూపం కళ్యాణతమం తత్
తే పశ్యామి యోteneloluku-letterసావసౌ పురుషః సోteneloluku-letterహమస్మి

భావం: ఓ భగవాన్, సకల జీవరాశులను పోషించి కాపాడే వాడవు. ఒంటరిగా పయనించే వాడవు. అన్నింటిని పరిపాలించే వాడవైన ఓ సూర్య దేవా! ప్రజాపతి కుమారుడా! నీ కిరణాలను ఉపసంహరించుకో. నీ దివ్య తేజస్సును కుదించుకో. మహి మాన్వితమైన నీ స్వరూపాన్ని నీ కృపా కటాక్షంతో నేను దర్శించాలి. నీవు శాశ్వతుడైన దేవదేవుడవు. నేను అలాంటి వాడినే.

భాష్యం: తృష్ణ తో ఉన్న మానవునికి కావలసింది భగవంతుని కృపాకటాక్షం మాత్రమే. దాని కోసమే ప్రార్థించాలి. సకల ప్రాణులు ప్రారబ్ధానుసారమే పనిచేస్తాయి. దుఃఖాలను అనుభవిస్తాయి. కానీ భగవంతుడు సంకల్పిస్తే ప్రారబ్దాన్ని అనుభవించవలసిన కాల వ్యవధిని తగ్గించి, ఒక వ్యక్తికి సత్వరమే అనుభూతిని ప్రసాదించవచ్చు.

తేజస్సుకు ఆవల ఏమున్నదో చూడడానికి, ఉపనిషత్తు ఋషి భగవంతుని కృపకై ప్రార్థించడం ఇక్కడ మనం చూస్తాము.

తేజస్సుకు ఆవల ఉన్నది ఏమిటి? తేజస్సుకు ఆవల తననే దర్శించినట్లు ఉపనిషత్తు ఋషి పేర్కొంటాడు. ఎన్నో ప్రయత్నాలు తర్వాత ఆత్మసాధనల అనంతరం భగవత్ దర్శనం తరువాత చరమస్థితి అనుభూతిగా ఈ ఋషి స్వయంగా తననే దర్శిస్తాడు. దీని భావం ఏమిటంటే సూర్యదేవునిలో ఉన్నది నేనే అని ఉపనిషత్తు చెప్పడంలో, నేను అనే పదాన్ని మనం సామాన్య అర్ధoలో తీసుకోకూడదు. నేను తేజస్సుకు ఆవల నెలకొని ఉన్నాను, అంటే అక్కడ ఉండే భగవంతుడను నేనే, అనగా ఆత్మ పరమాత్మలో సంధానం అయిపోతుంది, అంటే అదే మోక్షం. అదే నిజమైన ఆధ్యాత్మికత పరమావధి.

**** సశేషం ****

Posted in July 2024, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!