త్రినేత్రుడు..
విశ్వమంతా నిండినవాడు త్రయంబకుడు..
మూడు కన్నులతో అలరారు త్రినేత్రుడు..
ఆదియోగియైన శివుడు ధ్యానయోగి కాగా..
ఆటపట్టించనెంచె అమ్మ పార్వతి ముదముగా..
ఆతని రెండు కనులు మూసివేసె చిలిపిగా
తల్లడిల్లె ముల్లోకాలు కారుచీకటిని అలుముకొనగా..
అది చూచిన దేవతలు కలత నొందగా..
తన నుదుటను నిలిచె మూడోకన్ను
జగతికి వెలుగునివ్వగా..
శివయ్య కుడి కన్ను దినకరుడు కాగా..
ఎడమ కన్ను అలరారె శశిధరుడిగా..
మూడోకన్ను నిలిచె అగ్నికి ప్రతీకగా..
ఫాలభాగాన శోభిల్లెనది కుంకుమబొట్టుగా..
పరమేశ్వరుడు శాంతస్వరూపుడు..
ఆగ్రహానికి అవుతాడు ఆయన రౌద్రుడు..
మూడోకన్ను తెరచితే భస్మమే ముల్లోకాలు..
శరణుకోరితే కురిపించు కరుణా కటాక్షాలు..
మనందరిలోనూ వున్నది అంతర్నేత్రం..
మంచి చెడులకు అది మనోనేత్రం..
జ్ఞానానికి ప్రతీక ముక్కంటి మూడోనేత్రం..
విశ్వానికే చైతన్యం ఆ సుందర నయనం..
శివుని వర్ణన చాలా బాగుంది