February 2026 0 Comments « అహం బ్రహ్మాస్మి నేనెవరు!? (జీవిత సత్యం కవిత) » తీక్షణ వీక్షణంలోంచి…గవిడి శ్రీనివాస్ ఈ క్షణం కోసంతీక్షణంగా నిరీక్షణ చేస్తున్నానుఅక్షరాల దొంతరల్ని పేర్చుకుంటున్నాను.నిరీక్షణ వీక్షణంలోంచి లేచిఏవో క్షణాల్ని ఏరుకుంటున్నాను.ఏకాంతం రాలుతుందోఆక్షరం ఏలుతుందోమదిలో తుపానులు తరుముతుంటాయి.మనిషి మనుగడని తురుముతుంటాయి.అస్తిత్వం ప్రశ్నలు కుదుపుతూ ఉంటాయి.కాలం తో పోటీ పడటంసవాళ్ళకు పరిష్కారాలు అన్వేషించడం తోనేక్షణాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.నాది కాని ప్రపంచంలోనెగ్గుకు రావాల్సిన సందర్భాలు ఉంటాయి.ఏం క్షణం నాది కాకపోయినాతీక్షణంగా పరీక్షణ చేస్తేఏదో కొత్త రూపం లోవెలుగు రేఖలు కన్పిస్తుంటాయి. ******** 34 Posted in February 2026, కవితలు Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website