Menu Close
mg

తనువ.. హరిచందనమే..

నవ రసాలలో ఏ అభినయాన్నైనా అత్యంత సున్నితత్వంతో మన కనులకు కనిపించినట్లు, వీనులకు వినిపించగలిగిన గొప్పతనం మన తెలుగు సాహిత్యంతో మాత్రమే సాధ్యం. అదీ మన భాషా పండితుల ప్రజ్ఞాపాటవాలు అమోఘం. అటువంటిదే అతి సున్నితమైన శృంగార భావాలతో తీర్చిదిద్దిన ఈ మధుర గీతం. ఈ గీత రచయిత అంత పేరున్న వ్యక్తి కాడు. అయినను ఆయన మస్తిష్కంలో జనించిన ఈ భావాలు ఎంతో హృద్యంగా మనలను ఆకట్టుకొంటాయి. ఈ పాటలో పూలను ఎన్ని రకాల పేర్లతో పిలవచ్చో మనకు తెలుస్తుంది.

చిత్రం: కథానాయకురాలు (1971)

సంగీతం: విజయ రత్నం

సాహిత్యం: ఆకుల అప్పల రాజ్

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల

పల్లవి:

తనువ.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే

తనువా... ఉహు.. హరిచందనమే..
పలుకా.. ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

తనువా...ఉహు.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

తనువా హరిచందనమే..

చరణం 1:

నీ సోయగాలు కనుసైగ చేసే.. అనురాగ లతలు బంధాలు వేసే
ఉహు .. హు .. ఓహో
నీ సోయగాలు కనుసైగ చేసే.. అనురాగ లతలు బంధాలు వేసే

హరివిల్లునై ఈ విరి బాణమే
హరివిల్లునై ఈ విరి బాణమే
గురి చూసి హృదయాన విసిరేయనా.. నిను చేరనా.. మురిపించనా..

తనువా...ఉహు.. హరిచందనమే..
పలుకా..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

చరణం 2:

నీకోసమే ఈ నవ పారిజాతం .. విరబూసి నీముందు నిలచిందిలే...
ఆ...ఆ...ఆ...
నీకోసమే ఈ నవ పారిజాతం .. విరబూసి నీముందు నిలచిందిలే
మధుపాయినై మరులూరించనా
మధుపాయినై మరులూరించనా
ఉయ్యాల జంపాల ఊగించనా.. లాలించనా.. పాలించనా

తనువా ...ఉహు.. హరిచందనమే..
పలుకా ..ఉహు.. అది మకరందమే..
కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను
నలిగేను కాదా నీ మేను

Posted in May 2018, పాటలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!