తారకలు-కోరికలు
- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు
విశాల గగనంలో ఎన్నో తారకలు,
విచిత్ర హృదయంలో ఎన్నెన్నో కోరికలు.
తారకలు తళుక్కుమంటూ ప్రకాశిస్తాయి,
కోరికలు తడబాటు లేకుండా ప్రవేశిస్తాయి.
తారకలు గగనానికి అలంకారం,
కోరికలు మనస్సుకి ఆధారం.
తారకలు గగనాన్నిమెరిపిస్తాయి,
కోరికలు మదిని మురిపిస్తాయి.
తారకలు అలవికాని అనుభూతులకు కారణమౌతాయి,
కోరికలు అనంతమైన కన్నీటి చారికలకు ప్రేరణమౌతాయి.
తారకలు హృదయాన్ని ఆహ్లాద పరుస్తాయి,
కోరికలు గగనాన్ని చుంబిస్తాయి.
తారకలు గగనానికి అలంకారం,
కోరికలు హృదయానికి అలంకారం.
తారకలు చెప్పని కథలు లేవు,
కోరికలు తాకని వ్యధలు లేవు.
తారకలు లేని గగనాన్ని దర్శించలేము,
కోరికలు లేని హృదయాన్ని స్పర్శించలేము.
తారకలు,కోరికలూ రెండూ అనంతమే!
తారకలు,కోరికలు రెండూ ఊరించేవే,
చివరికి అశాంతిని చేరదీస్తాయి.