సుళువుగా పద్యం రాద్దాం
తెలుగు పద్దెము వ్రాయ రావోయ్ తెలుగు వెలుగుల నింపవోయ్ గణా లంటూ వెంట బడితే లెక్క దక్కును కైత చిక్కదు చుక్క లుండెడు దాక నిక్కెడు చక్కనౌ తలపున్న దొక్కటి తెలుగు పద్దెము..... మూస పట్టుక వ్రాసుకొంటే దోసమన్నది రాదు లేవోయ్ బాస నీదరి ఊసు లాడును ప్రాస కొఱకు ప్రయాస లుండవు తెలుగు పద్దెము..... తెలుగు పద్దెము వ్రాయు మన్నా! తెలివితేటలు చూపు మన్నా! తెలుగు బాసను నిలుపు మన్నా! బిడ్డబిడ్డల వర మ దన్నా! తెలుగు పద్దెము..... తల్లిబాసను గారవింపుము తల్లి మెట్టెల నిండ నింపుము మనసు విప్పిన తెలుగు పలుకులు వ్రాతలను మార్చేటి కొలకులు తెలుగు పద్దెము..... రోతమాటల రొంపి లోన పు నీతమాతను(1) దింపకోయ్ జాతి కీరితి నిల్పు ఊతలు తేనె లొల్కెడు కైతలేనోయ్ తెలుగు పద్దెము..... (1) పవిత్రమైన తల్లిని