Menu Close
TAGS-header

TAGS ఆధ్వరంలో “శ్రీ UAN మూర్తి మెమోరియల్  రచనల పోటీ”

విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస  తెలుగువారి రచనలకు TAGS ఆహ్వానం

(మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: డిసెంబర్ 15, 2018)

రాబోయే సంక్రాంతి 2019 సందర్భంగా అమెరికా లో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటో లో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) “శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ" నిర్వహిస్తుంది. భారత దేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగు వారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నాం. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తి కి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో లో విశేష కృషి చేస్తుంది. అమెరికా, కెనడా, యూరోప్ మరియూ ఇతర విదేశాలల్లొ నివసిస్థున్న తెలుగు రచయితలకు ఇదే మా ఆహ్వానం. స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీలో రెండు విభాగాలు ఉన్నాయి.

ప్రధాన విభాగం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత తెలుగు రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ:  $116, $58, $28
ఉత్తమ కవిత: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ:  $116, $58, $28

మొట్ట మొదటి రచనా విభాగం

కథ, కవితలూ వ్రాద్దామని కుతూహలం ఉన్నా, చిన్న ప్రయత్నాలు చేసినా, ఏదో ఒక కారణం చేత తమ రచనలను ఎక్కడా ప్రచురించని సరికొత్త రచయితలని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేకమైన పోటీలు నిర్వహిస్తున్నాం. తరాల తారతమ్యం లేకుండా,  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితలను ఈ తెలుగు రచనా విభాగం "పోటీ" లో పాల్గొనమని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక:  (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ:  $116, $58, $28
ఉత్తమ కవిత: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ:  $116, $58, $28

అన్ని పోటీలకీ ముఖ్య గమనికలు

  • ఒకే రచయిత ఒక్కో పోటీ లో ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. కథలు పది పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. పేజీ గరిష్ఠ కొలత 8.5 అంగుళాలు X 11 అంగుళాలు ఉండాలి. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్, స్వంత పత్రికలు మొదలైన వాటిల్లో ప్రచురించుకున్న లేదా ప్రచురించబడిన రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీ పత్రం రచనతో బాటు విధిగా జత పరచాలి. "మొట్టమొదటి కథానిక", "మొట్టమొదటి కవిత" పోటీలో పాల్గొనే వారు తమ రచనలు మొట్ట మొదటి రచనలని హామీ పత్రంలో పేర్కొనాలి.
  • హామీపత్రం/ధ్రువీకరణ పత్రం ఇక్కడ నుండి డౌన్ లోడు చేసుకొనగలరు: https://tinyurl.com/tagsform  :: డౌన్ లోడు చేసుకున్న పిదప సదరు పత్రం పూరించి, మీ రచన(ల)తో పాటుగా మాకు ఈమెయిలు చెయ్యగలరు.
  • రచనల్లో ఎక్కడా మీ పేరు కానీ, మీ కలం పేరు కాని వ్రాయకూడదు. మీ రచనలు మాకు పంపినప్పుడు, మీ హామీపత్రం లో ఆవివరాలు రాస్తే సరిపోతుంది.
  • మీ రచనలను తెలుగులో టైపు చేసి పంపితే బాగుంటుంది. యూనికోడ్ (Unicode) లో ఉన్న మీ రచనలు పంపితే మాకు శ్రమ తగ్గించిన వారు అవుతారు అని గమనించగలరు. చేతిరాత ప్రతులను పంపేవారు సదరు రచయిత చేతిరాత స్పష్టంగా, చదువ శక్యంగా ఉండాలని మనవి. అస్పష్ట, సందిగ్ధమైన లేదా చదవడానికి వీలుకాని రచనలు పోటీకి పరిశీలింపబడవు.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది (http://www.koumudi.net), సుజన రంజని (https://sujanaranjani.siliconandhra.org), శాక్రమెంటో స్థానిక పత్రిక “సిరిమల్లె”   https://sirimalle.com, మరియూ ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలుని బట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • బహుమతి పొందిన రచనలూ, ప్రచురణార్హమైన ఇతర రచనలు TAGS వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు రాబోయే సంక్రాంతి 2019  పండుగ కు ముందు ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితలు ఇతర పోటీలకు, ఇంకెక్కడా ప్రచురించ కూడదు.
  • కాలిఫొర్నియా లో శాక్రమెంటో నగరం లో, జనవరి 19, 2019 న జరగబోయే TAGS 15వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా సభాముఖంగా వేదికపై విజేతలకు బహుమతులు అందజేయబడతాయి, రాలేనివారికి పోస్టులో బహుమతులు పంపడం జరుగుతుంది. విదేశాలలో ఉంటున్న తెలుగు రచయితలకి ఇది ప్రత్యేక అవకాశం.
  • పోటీలొ పాల్గొనే రచయితలకు 18 ఏండ్లు నిండి ఉండాలి.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.

Last Date to receive entries is:  December 15, 2018

Please send entries by e-mail attachments only (PDF, JPEG or Unicode fonts – Unicode is preferred) To: telugusac@yahoo.com

భవదీయులు,
శాక్రమెంటో తెలుగు సంఘం రచనల పోటీ కార్యవర్గం

నాగ్ దొండపాటి (అధ్యక్షులు),
దుర్గ చింతల (కార్యదర్శి),
మోహన్ కాట్రగడ్డ (కోశాధికారి),
రాఘవ చివుకుల (సమాచార అధికారి)

అనిల్ మండవ (చైర్మన్),
మల్లిక్ సజ్జనగాండ్ల (వైస్ చైర్మన్),
వెంకట్ నాగం (సంపాదకులు, ట్రస్టీ),
సత్యవీర్ సురభి (సలహామండలి సభ్యుడు)

TAGS-logo
Posted in December 2018

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!