స్వ (సు) భాషితాలు
- సి. వసుంధర
- సుతిమెత్తని ఒక చిన్న మాట
సుత్తి దెబ్బలా పనిచెయ్యాలి. - చిన్న చిన్న సంఘటనలే
మహా కావ్యాలకు మూలధనం. - పదేపదే కనపడే రసావేశం
అవతల వారికి మిగులుస్తుంది రసాభాసం. - సు(స్వ)భాషితాలైనా స్వ(సు)భావోక్తులైనా
చూరగొనాలి అవతలి వారి హృదయాలను. - వాల్మీకికి మాల్స్ లేవు వ్యాసునికి హోటల్స్ లేవు
భిక్షమడిగి కుక్షి నింపుకొని అక్షర లక్షలు మనకర్పించారు. - జనవరి ఒకటైనా ఉగాది పండగైనా
అర్థం పరమార్థం ఒక్కటే. - అందరం అందుకే కలిసి రెండూ చేసుకొందాం
ఆది మధ్యాంతరహితుడైన కాలపురుషుని పూజించుకొందాం. - విందులు వినోదాలు ఎలా ఉండాలంటే
అందరికి ఆమోద ప్రమోదాలనందివ్వాలి. - శ్రుతిమించిన సంబరాలతో
అపశృతులను ఆహ్వానించకూడదు. - గతితప్పని కార్యక్రమాలతో
పలుకుదాం జనవరికి స్వాగతం.
జరుపుకొందాం సంబరాలను అంబరాన్ని అంటేటట్లు
మాటల ముచ్చట్లు, భావాల బొబ్బట్లు, కోరికల కుంపట్లు ….బాగున్నాయి