Menu Close
Shabdavedhi pagetitle
-- గౌరాబత్తిన కుమార్ బాబు --

నాసదీయ సూక్తం

సృష్టి ఎపుడు జరిగింది? ఎలా జరిగింది? ఎవరిచే జరపబడింది? ఎవరిచేతనైనా సృష్టించబడితే, ఆ సృష్టించినవాడిని సృజించింది ఎవరు? లేదా ఉత్పత్తి నాశనం లేనిదేదైనా ఉన్నదా? అంటే ఎల్లపుడూ ఉనికి గలది. ఈ ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రంలో సమాధానం దొరుకుంతుందా? లేదా వేదంలో ఏమైనా సమాధానం లభిస్తుందా?

ఓ మహా విస్ఫోటనం ద్వారా సృష్టి జరిగిందని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. మరి ఆ మహా విస్ఫోటనానికి పూర్వం ఏముంది? ఈ ప్రశ్నకు సబబైన సహేతుకమైన సమాధానం వేదంలో దొరుకుతుంది.

సనాతన ధర్మ గ్రంథాల్లో వేదోపనిషత్తులు కవితల ద్వారా ధార్మిక విషయాలను తెలియజేస్తే, పురాణేతిహాసాలు కథల ద్వారా ధార్మిక విషయాలను తెలియజేస్తాయి. పురాణేతిహాసాల్లో వివిధ దైవిక తత్వాలకు మానవరూపం ఇవ్వడం జరిగింది.

కవి అంటే క్రాంతదర్శి అనే అర్ధం ఉంది. అంటే గతించిపోయిన కాలాన్ని కూడా తెలుసుకోగలవాడని. భగవదనుభూతి పొందిన స్థితిలో వ్యక్తి కాలాతీతుడవుతాడు. అలాంటి స్థితిలో ఓ వేదం ఋషి గానం చేసిందే నాసదీయ సూక్తం (ఋగ్వేదం 10.8.129).

ఋషులకు శాస్త్రజ్ఞులకు తేడా ఏంటంటే? శాస్త్రజ్ఞులు సత్యాన్ని బాహ్యంలో అన్వేషిస్తే ఋషులు హృదయంలో అన్వేషిస్తారు. ఋషులు సత్యానికి సత్యంకాని దానితో ఉన్న సంబంధాన్ని అంతర్దృష్టి ద్వారా కనుగొన్నారు. శాశ్వతమైన వాస్తవాన్ని పారమార్ధిక సత్యమని, శాశ్వతం కాని దాన్ని వ్యావహారిక సత్యమని ఋషులు అన్నారు.

తమ॑ ఆసీ॒త్తమ॑సా గూ॒ళ్హమగ్రే॑ఽప్రకే॒తం స॑లి॒లం సర్వ॑మా ఇ॒దమ్ ।

సృష్టికి పూర్వం అంధకారం అంధకారంతో ఆవృతమై ఉంది. యావత్తు గుర్తించలేని వెల్లువై ఉంది.

ఇది సృష్టికి పూర్వం విశ్వం యొక్క స్థితి.

తు॒చ్ఛ్యేనా॒భ్వపి॑హితం॒-యఀదాసీ॒త్తప॑స॒స్తన్మ॑హి॒నాజా॑య॒తైక॑మ్ ॥

సమస్తాన్ని తనలో ఇముడ్చుకున్నవాడుగా, శూన్యంతో ఆవృతమైనవాడుగా ఏకాకిగా ఏ భగవంతుడు ఉన్నాడో, ఆయన తపోమహిమ వలన తనను అభివ్యక్తం చేసుకున్నాడు.

కామ॒స్తదగ్రే॒ సమ॑వర్త॒తాధి॒ మన॑సో॒ రేతః॑ ప్రథ॒మం-యఀదాసీ॑త్ ।

మనసుకు ప్రథమబీజంగా ఏది ఉన్నదో , ఆ ఆకాంక్ష మొదట అంకురించింది.

ఈ విధంగా అంధకారం నుండి సృష్టి జరిగింది.

తొలుత అద్వైతాన్ని చెప్పిన ఈ సూక్తం, చివరి రెండు శ్లోకాల్లో "అజ్ఞేయత"(Agnosticism)ను వ్యక్తం చేసింది.

కో అ॒ద్ధా వే॑ద॒ క ఇ॒హ ప్ర వో॑చ॒త్కుత॒ ఆజా॑తా॒ కుత॑ ఇ॒యం-విఀసృ॑ష్టిః ।

నిజానికి ఈ సృష్టి ఎక్కడ నుండి ఉద్భవించిందో ఎవరి కెరుక ? ఈ సృష్టి ఎక్కడ నుండి ఉద్భవించింది ?

ఈ విషయం ఎవరు చెప్పగలరు?

ఇ॒యం-విఀసృ॑ష్టి॒ర్యత॑ ఆబ॒భూవ॒ యది॑ వా ద॒ధే యది॑ వా॒ న । యో అ॒స్యాధ్య॑క్షః పర॒మే వ్యో॑మం॒త్సో అ॒ఙ్గ వే॑ద॒ యది॑ వా॒ న వేద॑ ॥

ఈ సృష్టి ఎందు నుండి ఉద్భవించిందో, అది ఈ సృష్టిని భరిస్తున్నదా, లేదా అనే విషయం ఉత్కృష్టమైన గగనతలంలా వసించే ఈ సృష్టి నాయకుడు ఎవరో ఆయన కచ్చితంగా ఎరిగి ఉంటాడు. బహుశా ఆయనకు సైతం తెలియదేమో !

This sukta is a thought-provoking hymn in Vedas. As exclaimed by Generative AI, Nasadiya Sukta is a philosophical exploration of the universe’s origin and the nature of reality, rather than a literal creation of story.

A. A. Macdonell, who translated Nasadiya Sukta into English, calls it the hymn of creation and it is the standing point of natural philosophy which developed into the Sankhya system.

***సర్వే భవంతు సుఖినహా***

Posted in May 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *