ప్రేయసీ ప్రియుల మధ్యన గానీ, ఆలుమగల మధ్యన గానీ సహజమైన ప్రేమానురాగాలు చిగురించిన నాడు వారిరువురి సంతోషకర సమయంలో ఖచ్చితంగా ప్రకృతి సాంత్వనము లభిస్తుంది. అప్పుడు వారిలో కలిగే భావనలు ప్రకృతితో మమేకమై ఉంటాయి. ఆ భావాలకు అక్షర రూపం కల్పించి మహాకవి ఆరుద్ర గారు ఎంతో భావయుక్తంగా ఈ క్రింది పాటను రచించారు. దానికి చక్కటి స్వరకల్పన చేసి ఘంటసాల గారు తను పాడకుండా ఎస్.పి గారి చేత ఆ పాటను పాడించి ప్రోత్సహించారు. ఎంతో హృద్యంగా పాడిన ఆ పాటను మీ కోసం అందిస్తున్నాము.
లలలలాలలలా
అహా
లలలలాలలలా
అహా
అహహహా హా
అహహహా హా
అహహహా హా
సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా
సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిల మిలా
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా
చందమామ కన్న నీ చెలిమి చల్లనా
సన్నజాజి కన్న నీ మనసు తెల్లనా
నిన్ను కౌగిలించ గుండె ఝల్లనా
నిన్ను కౌగిలించ గుండె ఝల్లనా
నిలువెల్ల పులకించు మెల్లమెల్లనా
సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా
సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతళా
పసి నిమ్మపండు కన్న నీవు పచ్చనా
ఫలియించిన మన వలపే వెచ్చవెచ్చనా
అనురాగం ఏదేదో అమరభావనా
అనురాగం ఏదేదో అమరభావనా
అది నీవు దయచేసిన గొప్ప దీవెనా
సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా
సెలయేటి గలగలా చిరుగాలి కిలకిలా
సిగ్గుపడే బుగ్గలతో చెలి నవ్వుల మిలమిలా
చిలిపి చిలిపి చూపులతో నీ ఊహలే తళతలా
అహా అ అ
అహా అహహహా హా
అహహహా హా
అహహహా హా
అహహహా హా