౧౧౧౧. చంక ఎక్కిన పిల్ల చచ్చినా దిగదు.
౧౧౧౨. చక్కనమ్మ చిక్కినా అందమే, సన్నని బట్ట మాసినా అందమే!
౧౧౧౩. చక్రవర్తి చేస్తే శృంగారము, అదే సామాన్యుడు చేస్తే వ్యభిచారము.
౧౧౧౪. చచ్చేకాలంలో సత్యభామ వేషం కడతా నన్నాడుట!
౧౧౧౫. చదువుకున్న వాడికంటే చాకలాడు మేలు.
౧౧౧౬. చదవేస్తే ఉన్న మతి కాస్తా కూడా పోయిందిట!
౧౧౧౭. చదువు చారెడు, బలపాలు బోలెడు!
౧౧౧౮. చదువుకి ముదురు, సాముకి లేత ...
౧౧౧౯. చదువురాని మొద్దు, కదలలేని ఎద్దు ...
౧౧౨౦. చదువు సన్నం - అయ్య లావు ...
౧౧౨౧. చంటి బిడ్డకు, చల్ల కుండకు చాటు, మరుగు ఉండాలి.
౧౧౨౨. చౌక అమ్మనీయడు, ప్రియం కొననీయడు...
౧౧౨౩. చాకలి కొత్త, మంగలి పాత ఉండాలి.
౧౧౨౪. చాకలి తెలుపు, మంగలి నునుపు తప్ప అయ్యదగ్గర మరేమీ లేవు.
౧౧౨౫. చావు కబురు చల్లగా చెప్పాలి.
౧౧౨౬. చాలుపైన చాలు దున్నితే చవిటి పొలమైనా పండుతుంది.
౧౧౨౭. చావు కంటే గండం లేదు.
౧౧౨౮. చావుకు చావు లేదు.
౧౧౨౯. చావుకు పెడితేగాని లంఖణాలకి ఒప్పుకోడు.
౧౧౩౦. చావుతప్పి కన్ను లొట్టపోయింది.
౧౧౩౧. చింత చచ్చినా పులుపు చావదు.
౧౧౩౨. చింతలేనమ్మ సంతలో నిద్రపోయిందిట!
౧౧౩౩. చిక్కితే దొంగ, చిక్కకుంటే దొర.
౧౧౩౪. చిక్కిన దొంగ సిగ్గెరుగడు, బలిసిన దొర వావెరుగడు.
౧౧౩౫. వలలో చిక్కిన సింహాన్ని కుక్కయినా కరవగలదు.
౧౧౩౬. చిక్కుడు తీగను బీరకాయలు కాయవు.
౧౧౩౭. చిచ్చులో దూకబోతూ, చీర కొంగు సద్దుకుందిట!
౧౧౩౮. చితిలో చచ్చిన వాడు కాలితే, చింతలో బ్రతికున్నవాడే కాలుతాడు.
౧౧౩౯. చిత్తం శివునిమీద, దృష్టి చెప్పులమీద ...
౧౧౪౦. చిన్న వాళ్లకు పెడితే చిరుతిండి, పెద్దవాళ్ళకైతే ఫలహారం...