౭౨౧. కాలం కలిసిరానప్పడు నీతి చెప్పినా బూతులాగే వినిపిస్తుంది.
౭౨౨. జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలింది...
౭౨౩. దొంగలాడబోతే మంగలం దొరికింది.
౭౨౪. మూసిపెడితే పాసిపోయింది.
౭౨౫. ఇంటికంటే గుడి పదిలం.
౭౨౬. రెక్కాడితేగాని డొక్కాడదు.
౭౩౦. మండే పొయ్యిమీద కూర్చోబెట్టి, తలమీద చన్నీళ్ళు చల్లినట్లు ...
౭౩౧. ఇంట్లో ఈగలమోత, బయట పల్లకీల మోత ...
౭౩౨. పూజకొద్దీ పురుషుడు, దానంకొద్దీ బిడ్డలు...
౭౩౩. విధం చెడిన దాసరి పదం మరిచాడుట!
౭౩౪. అంకని కోతి లంకంతా చేరిచిందిట!
౭౩౫. అంగట్లో అరువు తలమీది బరువు ...
౭౩౬. అంగట్లో ఉన్న బెల్లం గుడిలోని లింగానికి నైవేద్యం.
౭౩౭. అంచు డాబేగాని, పంచడాబు లేదు.
౭౩౮. అంటే ఆరడి, అనకుంటే అలుసు.
౭౩౯. అండ ఉంటే చాలు, కొండ దాటేయ్యవచ్చు.
౭౪౦. అంతగా ఉరిమి ఇంతేనా కురిసేది?
౭౪౧. అంతా తెలిసినవాడూ లేడు, ఏమీ తెలియనివాడూ లేడు.
౭౪౨. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు.
౭౪౩. అందం ఉంటే చాలదు, అదృష్టం ఉండాలి....
౭౪౪. అందని మ్రాని పండ్లకోసం అర్రులు జాచి ప్రయోజనం లేదు.
౭౪౫. అందరికీ శకునం చెప్పే బల్లి, తాను వెళ్లి కుడితి తొట్టెలో పడిందిట!
౭౪౬. అందం కోసం కొన్న బంగారు నగలు ఆపదలో ఆదుకుంటాయి .
౭౪౭. అ ఆలు రానివాడు అగ్రతాంబూలం కావాలన్నాడుట!
౭౪౮. అకటా వికటపు రాజుకు అవక్తపు ప్రధాని, అస్తవ్యస్తపు పరివారం ...
౭౪౯. అక్కచెల్లెళ్ళకు అన్నం పెట్టి లెక్క రాసుకున్నాడుట!
౭౫౦. అక్కరకు రాని చుట్టం ఉన్నా, లేకున్నా ఒకటే...