గత సంచిక తరువాయి »
౩౮౧. ఉడుము కెంధుకురా బాబూ ఈ ఊరి పెత్తనం....
౩౮౨. ఉరుము ఉరిమి మంగలం మీద పిడుగు పడిందిట!
౩౮౩. గొడ్రాలికి ఎలా తెలుస్తాయి బిడ్డనొప్పులు?
౩౮౪. ఆస్థి మూరెడు, ఆశ బారెడు...
౩౮౫. ఆశ లావు, పీక సన్నం.
౩౮౬. తినబోతూ రుచులడగడం ఎందుకు?
౩౮౮. బురదలో ఎంత పన్నీరు పోసినా బురద కంపు పోదు.
౩౮౮. పాముకి పాలుపోసి పెంచినా అది విషమే కక్కుతుంది.
౩౮౯. బొంకరా బొంకరా పోలిగా - అంటే టంగుటూరు మిరియాలు తాటి కాయలంత ఉంటాయి - అన్నాడుట!
౩౯౦. కలిమిలేములు కావడి కుండలు.
౩౯౧. కుండెడు పాలు చెడగొట్టడానికి ఒక్క బొట్టు విషం చాలు
౩౯౨. లోకులు పలుగాకులు.
౩౯౩. దున్నపొతు ఈనిందంటే, దూడని కట్టెయ్యమన్నారుట!
౩౯౪. కాకులెన్నో చేరి "కావు, కావు" మంటే కూలిపోతుందా ఏమి కోకిల పరువు!
౩౯౫. పూసీ కాసీ చేలో పులి పడితే, అన్నాచెల్లెలి గట్టు అడ్డు పడిందిట!
౩౯౬. ఎద్దుకేం తెలుసు అటుకులరుచి.....
౩౯౭. పందికేం తెలుసు పన్నీరు పరిమళం?
౩౯౮. దేముని పెళ్ళికి అంతా పెద్దలే ...
౩౯౯. పొమ్మనలేదు, పొగ పెట్టేరు...
౪౦౦. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మేలు.
౪౦౧. మందు లెన్నైనా ఉన్నాయి గాని మనోవ్యాధికి మాత్రం మందు లేదు.
౪౦౨. కోడలు కొడుకును కంటానంటే ఒద్దనే అత్తగారు ఉంటుందా ...
౪౦౩. నీరు పల్లమెరుగు - నిజము దేవుడెరుగు.
౪౦౪. పెనం మీదినుండి తప్పించుకోబోయి, జారి పొయ్యిలోపడినట్లు....
౪౦౫. చుక్కల్లో చంద్రుడిలా ఉండాలి.
౪౦౬. ఉల్లి ఉల్లే - మల్లి మల్లే!
౪౦౭. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యలేదు.
౪౦౮. కాళ్ళు చెప్పుల్లో ఉంచుకుని, చెప్పులు పోయాయని తెగ వెతుక్కున్నాడట!
౪౦౯. ఉయ్యాలలో బిడ్డ నుంచుకుని ఊరంతా వెతికినట్లు.
౪౧౦. ఒడ్డు ఎక్కి, మొనగాడు తెడ్డు విరిచేశాడుట!