సాహితీ ప్రక్రియ - గజల్...
సంగీత నృత్యాల తేలేరు ప్రియతమలె!
ప్రేమకే రూపమై నిలిచేరు ప్రియతమలె!
ఒకరికై ఒకరమనె అనుభూతె మధురమౌ!
మోహాల పల్లకినె యెక్కేరు ప్రియతమలె!
పున్నమీ చంద్రుడే మురిసేను జంటగని,
చల్లనీ వెన్నెలలొ తడిసేరు ప్రియతమలె!
తియ్యనీ తలపులే మదిలోన నిండేను!
ఊసులే బాసలుగ మలచేరు ప్రియతమలె!
సత్యమైన తొలివలపు నిలుచునులె హృదిలోన!
ప్రేమమయ రాజ్యాన్ని యేలేరు ప్రియతమలె!
చెంగల్వలు కొలనులో విరిసెనులే అందముగా!
కలువలజత కృష్ణవేణి మురిసెనులే అందముగా!
చంద్రముఖీ హొయలుగనీ హృదయగతియె లయతప్పెను,
లలనమోము చిరునగవుల వెలిగెనులే అందముగా!
రమణికనులు అనురాగపు సిరులెన్నో కురిపించే,
సరసులోన విరులగూడి తడిసెనులే అందముగా!
మౌనముగా భామమనసు ఆలపించె రాగాలే!
మనోహరుని తలచుకొనీ నవ్వెనులే అందముగా!
సత్యలోక సుందరియని సుమములకే అచ్చెరువయె!
సంధ్యవేళ అతివసొగసు మెరిసెనులే అందముగా!
***
చెంగల్వలు = ఎర్ర కలువలు