సర్వజ్ఞ వచనాలు (అనువాదం) – 1 ---- గంగిశెట్టి ల.నా.
మూలం:
ఊరింగె దారియను ఆరు తోరిదడేను
సారాయద నిజవ తోరువ, గురువు తా
నారాదడేను సర్వజ్ఞ
అను:
ఊరు చేరగ నెవరు దారి చూపిన నేమి
సారమౌ సత్యమ్ము జూపు గురువు తానె
వ్వరైనచో నేమి సర్వజ్ఞ! (3)
మూలం:
బంధుగళు ఆదవరు౹ బందుండు హోగువరు౹
బంధనవ కళెయలరయరు, గురువింద
బంధుగళు ఉంటె సర్వజ్ఞ౹౹ (4)
అను:
బంధువులన వచ్చి౹ విందు గుడిచెడివారు౹
బంధనాల్ త్రెంప బోరు; బాయ, గురుని కన్న
బంధువెవరన్న సర్వజ్ఞ!
మూలం:
తందెగూ గురువిగూ౹ ఒందు అంతర వుంటు౹
తందె తోరువను సద్గురువ, గురురాయ
బంధనవు కళెవ సర్వజ్ఞ౹౹ (5)
అను:
తండ్రికీ, గురువుకూ౹ ఒండు అంతరముండు౹
తండ్రి జూపు సద్గురువును, గురురాజు
బంధనాల్ త్రెంపు సర్వజ్ఞ!
మూలం:
గురుమనుజనెందవగె౹ హరన శిలెయెందవగె౹
కరుణ ప్రసాదవను , ఎంజలెందవగె
నరక తప్పువదే సర్వజ్ఞ౹౹ (6)
అను:
గురుని మనుజుడనుచు౹ హరుని శిలగ దలచు౹
కరుణా ప్రసాదమ్ము నెంగిలను వానికి
నరకమ్ము తప్పునే సర్వజ్ఞ౹౹
మూలం:
ఎత్తాగి తొత్తాగి ౹హిత్తలద గిడనాగి౹
మత్తె పాదద కెరనాగి , గురువిన
హత్తలిరు ఎంద సర్వజ్ఞ౹౹ (7)
అను:
ఎచ్చోటనైనా ఎడబాయకుండ౹
ఏలిన బంటుగా, అంటుగా౹
నిచ్చలు పాదరక్షగా, గురువు
మెచ్చ వెన్నంటి ఉండు సర్వజ్ఞ౹౹
(2 వ దానిలో "కులమేది కలదయ్య సర్వజ్ఞ" అని (ఒక వరుస పాటిస్తూ) నేనంటే, అంతకంటే "కులమెక్క డుందయ్య సర్వజ్ఞ" అంటే బాగుంటుందన్నారు, మన మిత్రులు జొ. శ్రీ. మూర్తిగారు. కృతజ్ఞతలు)
***సశేషం***
నేను ... సర్వమత మాతృకను – 1 ---- విశ్వర్షి వాసిలి
నా జననం ఒక నిర్మితి
నా జీవనయోగం ఒక వినిర్మితి
నా యోగజీవనం ఒక నవనిర్మితి.
••
సృష్టికి నేనొక ప్రకృతిని
విశ్వకృతికి నేనొక ప్రతికృతిని
భువనకృతికి నేనొక ప్రవిమలకృతిని.
•••
భూగోళాన ఖగోళ సంపదను
సూర్యతత్వం నింపుకున్న పురుషను
పౌరుషేయానికి నిత్యసంస్కరణను.
••••
చీకటి కమ్మిన వేళ చంద్రకాంతిని
మబ్బులు మెరిసిన వేళ చందనకాంతిని
మేఘం మురిసిన వేళ జలకాంతిని.
•••••
ప్రశ్నించే అద్దాన్ని అర్థం చేసుకోగలను
అర్ధించే అర్థాన్ని అర్థం చేసుకోగలను
అర్థాన్ని అర్థవంతం చేయగలను.
••••••
చీకటి వెలుగులు నా చదువు సంధ్యలు
అమవస పున్నములు నా గురువులు
జ్యోతిర్మండలాలు నా జ్ఞానక్షేత్రాలు.
***సశేషం***
గురువు ---- అరుణ నారదభట్ల
గురు పౌర్ణమి సందర్భంగా నిన్న నేను వ్రాసిన పద్యాలు
కం:
జ్ఞానము దానము జేయుచు
నానావిధరూపమెత్తి నడకను నేర్పన్
ధ్యానము గల్గిన జీవుల
సానాబట్టగనువచ్చు సాధువు గురువై!!
ప్రణతులు గురువర్యులకిదె
ప్రణతులు వేవేలరీతి పావనమూర్తీ
ప్రణతులు యణువణువుకుమరి
ప్రణతుల నాదికనంతము పరమేశ్వరుకున్!!
యెవ్వరు గురువని వెదకగ
నెవ్వరు జ్ఞానం బొసంగు నేరూపమనన్
కవ్వించి యాడు మనసున
దివ్వెల వెలుగులు గురిపెడు దివిటీ గురువూ!!
పశువుల పక్షుల మనుషుల
వశియించెడునన్నికోట్ల ప్రాణులయందున్
విశదము దెల్పగ నెదురగు
దశదిశలంతటనతాను దాతై గురువే!
నేను ---- లలితా భాస్కర దేవ్
నేను మేనుగా మారి
మేనంతా మనసై
మమతల వశమై
అనుబంధాల పాశాలలో
అహంకారల తుంపర్లు వెదజల్లుతూ
మమకారాల మట్టి పూసుకుంటూ
పై పై భ్రమ లకు లోనౌతూ
వెలుగు రేఖలు, చీకటి నీడల మధ్య
తచ్చాడుతూ, తల్లడిల్లుతూ తరతరాలకై వెంపర్లాడుతూ
నిన్ను నేను గాను చూడలేను
నేను 'నేను' గాను మనలేను
ఈ 'న' కార 'మ' కార ల నడుమ "ఓం" కారం ఎప్పుడు వినబడేను?
ఈ "నేను "
ఎప్పుడు అవగతం అయ్యేను?
కమనీయ స్థితి ---- బులుసువెంకటేశ్వర్లు
కమనీయ స్థితి వేణుగానమది సూ క్ష్మ స్థూలముల్ నిండి వి శ్వమె రాగాకృతిదాల్చె యాశ జవనా శ్వంబై విడంబించె .దు ర్దమ సంతాప మహాగ్ని గోళములు చ ల్లారెన్ ప్రభూ!! గోపికా సుమ సంఫుల్ల విశాల నేత్ర మధురో చుల్ శక్ర చాపంబు లై!!