
‘కాఫీ – టిఫిన్ – తయ్యార్ ! వీడియో కథనం
ఇతరుల జీవితాలలో శాంతిసంతోషాల వెలుగులు నింపిన ఓ త్యాగమయి గాధ. 'తన' అనుకున్న వారి సుఖసంతోషాల కోసం పాటు పడిన ఆమెకు మిగిలింది .. దైవానుగ్రహమా?
కోసూరి ఉమాభారతి రచన. ప్రముఖ సాహితీ గళ కారిణి అయ్యగారి వసంతలక్ష్మి గారి గళం నుండి జాలువారి వీక్షకులను, పాఠకులను ఆకట్టుకున్న కథనం.
ప్రముఖుల నవలలనూ.. కథలనూ .. తన గళాన్నే ఆయాపాత్రలకు అనువుగా మారుస్తూ చదివి వినిపించడం వసంతలక్ష్మి గారి ప్రత్యేకత. దాంతో కథను మీరు వింటూనే చూసిన అనుభూతినిపొందడం ఖాయం.
“రోజూవారీ జీవనంలో శ్రమించి, విసిగి వేసారిన మనుషులకి, ఆహ్లాదం, ఉల్లాసం అవసరం కనుక కళలు జనించాయని.. కవిత్వం, చిత్రలేఖనం, సాహిత్యం, సంగీతం, నృత్యం మనసుని ఉత్తేజపరచే సాధకాలే” అని ఐదవ వేదంగా పరిగణింపబడే నాట్యశాస్త్రంలో ప్రస్తావించారు.
కళకళలాడే జీవనం అంటే ఆందోళన రహిత జీవన విధానం అని, అందుకోసం నిత్యచైతన్యానికి, ఆనందానికి దారులు అన్వేషించాలనీ సూచించే సిద్దాంతాలు ఎన్నో నిజ జీవన చట్రంలో ఇమిడి వున్నాయి.
అలా ఆందోళన తొలగి, ఉత్సాహం ఉప్పొంగాలన్నా, ఆనందం ఉరకలు వేయాలన్నా ... ఓ కమ్మని రాగం, ఓ చక్కని దృశ్యం, ఓ దివ్యమైన కావ్యం చాలునేమో అని అనిపిస్తుంది.
అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ వారి ‘సాహిత్య – సాంస్కృతిక - సమ్మోహనం’ అనే ఈ vlog సిరీస్ లో .. వచనం, రచనం, గీతం, నృత్యం, కథనం ద్వారా సంగీతం, సాహిత్యం, నర్తనం, చిత్రలేఖనం వంటి కళలు వీక్షకులకి వినోదాన్ని పంచుతాయని ఆశిస్తూ ఈ సరికొత్త శీర్షిక ద్వారా దృశ్య మాలికా పరంపరలను మీకందించే ప్రయత్నం చేస్తున్నాము. మీ సూచనలు సలహాలు శీర్షిక క్రింద ఉన్న కామెంట్ బాక్స్ ద్వారా మాకు తెలుప కోరిక.
నమస్కారములతో –
‘నాట్యభారతి’ ఉమాభారతి
కూచిపూడి నాట్యకారిణి, నాట్య గురువు, నటి, రచయిత్రి, టీవీ చిత్ర నిర్మాత – దర్శకురాలు
అర్చన ఫైన్- ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంస్థాపకురాలు