Menu Close
mg

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో

చిత్రం: రావణుడే రాముడైతే (1979)

సంగీతం: జి.కె. వెంకటేశ్

గేయ రచయిత: వేటూరి సుందరరామ్మూర్తి

గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి

పల్లవి:

ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఆ..ఆ... ఆ
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో..
ఆ .. ఆ.. ఆ..
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే... ఆ .. ఆ.. అందని... ఆ .. ఆ.. ఒకే ఒక అందానివో...

చరణం 1:

ఏ రాగమో.. తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో.. నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావాలో.. అనురాగ యోగాలై....
ఆ.. ఆ... ఆ.. ఆ... ఆ.. ఆ
నీ పాటలే పాడనీ..

రవివర్మకే... ఆ .. ఆ.. ఆ.. అందని... ఆ .. ఆ.. ఆ.. ఒకే ఒక అందానివో...

చరణం 2:

ఏ గగనమో కురులు జారి.. నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి.. కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే.. నీ దివ్య శిల్పాలై
ఆ .. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ...
కదలాడనీ.. పాడనీ..

రవివర్మకే... అందని.. ఒకే ఒక అందానివో...
ఆ .. ఆ.. ఆ....
రవి చూడని.. పాడని.. నవ్యనాదానివో...
రవివర్మకే.. ఆ.. ఆ... అందని.. ఆ.. ఆ...
ఒకే ఒక అందానివో...

Posted in September 2018, పాటలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!