గలగల పారుతూ పరవళ్ళుతొక్కే పెన్నా నది
చూపరులని ఆకర్షించే ప్రదేశమది
చారిత్రక వైభవోపేతమైన కట్టడమది
ఎన్నోయేళ్ళ ప్రాశస్త్యము కలిగిన అద్భుతవైనం
రమణీయ శిల్పాలతో కూడి అలరారేది
పెన్నా నది ఒడ్డున కలదు అది.
మహాభారతం సగభాగాన్ని సంపూర్ణం
కావించి పలు రచనా ప్రక్రియలతో
ఏటి ఒడ్డున సాహిత్యాన్ని ఉరకల పరుగులతో
ప్రభవింప జేసిన కవిత్రయంలో ఒకరుగా పేరుగాంచిన
తిక్కన పుట్టిన ప్రసిద్ధ స్థలమది..
స్కంద వైష్ణవ సంహితలో పేర్కొనినది
భక్తుల కోర్కెలు తీర్చే సుప్రసిద్ధ క్షేత్రమది
నిత్యోత్సవాలతో సర్వజనులను అలరించేది
వాహనంలో ఊరేగుతూ దర్శనమిచ్చే
తల్పగిరి రంగనాథస్వామి ఆలయమది...
అన్నిటిని మించి జనులని ఆకర్షించేది
ఏవైపు తిరిగిన ప్రతిబింబం గోచరించేది
అచ్చెరువున మంత్రముగ్ధులను చేసేది
కప్ఫుపైభాగంలో ముధ్ధుగారే యశోద
తనయుని చిత్రంతో మరింత శోభతో
అగుపించే మరెచ్చోట కానరాని అందమైన
అధ్ధాలమంటపమది.
ఎంతో ఘనత కలిగి
చదువుల సరస్వతికి నిలయమై
వరిధన్యానికి భాండాగారమై
నెల్లూరు అనబడే
నాటి విక్రమ సింహపురి
నేటి పొట్టిశ్రీరాములు జిల్లా
నేను గర్వపడే నా స్వస్థలం
కడు రమణీయం....