రావి చిట్టి గేయాలు
- డా. రావి రంగారావు
నాలో దేవత లున్నారు...
నా నుదురు లోన ఉన్నాడట
బ్రహ్మ దేవుడు...
నా కళ్ళల్లో ఉన్నారట
శివ కేశవులు...
నా ముక్కు మీద ఉన్నాడట
విఘ్నేశ్వరుడు...
నా బుగ్గలపై ఉన్నారట
లక్ష్మీ పార్వతులు...
నా పెదవులలో ఉన్నాడట
ఆంజనేయుడు...
నా గడ్డంలో ఉన్నాడట
భీమసేనుడు...
నా మాటలలో ఉన్నదంట
సరస్వతీ మాత...
నా చేతలలో ఉన్నదంట
నా ముందు బతుకు గీత.