మట్టి మనిషి మంత్తసానైయ్యాడు
పుడమి పురీటినొప్పులు పడుతున్నది
ఆకాశం కళ్ళల్లో ఒకటే ఆనందం (మెరుపులు)
ఒకటే ఉత్సాహం (ఉరుములు)
అదేపనిగా తడిపేసిన
నల్ల మేఘాలు తెల్లబోయాయి...
పశువుల ఆకలి తీర్చ పట్టుబట్టి
పచ్చగడ్డి మోసుకెళుతున్న
ఆమె సంకల్పం ముందు
నిలవలేక గాలికి కొట్టుకుపోయాయి...
మమకారం ముందు
వెటకారం వీగిపోవాల్సిందే....
పల్లెతల్లి మెడలో అపురూప ముత్యాలు
ఇటువంటి దృశ్యాలు
పువ్వై పరిమళించాల్సిన మొగ్గను
మదమెక్కిన ఏనుగులు
మదజలాన్ని చల్లి
కాలికింద త్రొక్కిపెట్టి నేల రాల్చాయి
దేశపు చీకట్లు తీస్తానని
చిరునవ్వు నవ్వు నవ్విన
పువ్వైనా కాని మొగ్గను
ఆ చీకట్లే చిదిమేశాయి
ఆశల వృక్షమై
ఆశయాలకు నీడనిస్తాననే
ఆ మొక్కను
కామపు కోరలు కోసేశాయి
కలికాలపు అసురుల దాహానికి
బలైపోయావా చిట్టితల్లి
నీకు జరిగిన అన్యాయాన్ని
వివరించలేక
అక్షరాలు ఆవేదన పడుతున్నవి
పదాలు పరివేదనొందుతున్నవి
వాక్యాలు ఏడ్చుతున్నవి
సమాజపు తోటలో మొగ్గలను కత్తిరించే
కామపు కత్తెరలకు
కత్తెర వేయలేని మా అసమర్థతను
క్షమించు తల్లి
గంప కృసించి పోయింది
పలుగు పరివేదనొందింది
సెలిక సొమ్మసిల్లిపోయింది
ఇసుక చిన్నపోయింది
సిమెంటు అయోమయ పడింది
గోడ గోడును వెళ్ళగక్కింది
భవనం బాధనొందింది
అనుకోకుండా
జారిపడిన రాయిని
రక్తంతో తడిపి
తన చెమటచుక్కలతో స్నానం చేయించిన భవనానికి
నెత్తుటిని బొట్టుగా పెట్టి వెళ్ళిపోయిన
కార్మికుడిని చూసి
మొరటోడని
కరుకోడని
కూలోడని
మాపై చిన్నచూపెందుకో
గంపలెత్తేవాడని
రాళ్ళుమోసేవాడని
దుమ్ముకొట్టుకున్నవాడని
అడ్డమైన పనులుచేసేటోడని
మాపై చిన్నచూపెందుకో
చదువుకోకపోతే
అలా అవుతావని
వందలాది విద్యార్థులకు
వేలెత్తి చూపెడుతూ
పదేపదే మా మనసును
గాయపర్చుతారు
చదువుకోకపోవడమే
మేము చేసిన నేరమా
చదువులేకపోవడమే
మా పాపమా
ఆనాడు మా స్థితిగతులేంటో
ఎవరికి ఎరుక
ఎందుకో అసలెందుకో
కూలోడంటే
ఇంత చిన్నచూపు
పడకసుఖానికి
రూపుదిద్దుకున్న
ఆ ప్రాణం
అమావాస్య చీకటిలా
చీకటి గర్భశయంలో
కరిగిపోయిన ఆడపిల్ల
ఆదిశక్తి యెట్లవుతుంది
పుట్టగానే ఆడపిల్లని
తేలికగా తీసిపారేయబడి
అసమానతల మధ్య
పెరగబడి
అయిన వారిచే అవమానాలను
ఎదుర్కుంటున్న ఆడపిల్ల
ఆదిశక్తి యెట్లవుతుంది
ప్రాయం రాగానే
కట్టబాట్లకు కందిపోతూ
పోరికిగాళ్ళ కామపు
పాశాలకు పతనవుతూ
తనలోనే తాను ఆవేదనపడే ఆడపిల్ల
ఆదిశక్తి యెట్లవుతుంది
ఓ ఇంటికి దీపమై
కరిగిపోతూనే
అత్తమామల ఆగడాలలో
అణిగిమణిగి ఉంటూనే
బండచాకిరిచేస్తూ
మగాడి పడకసుఖానికి పనికొచ్చే
ఆటవస్తువుగా మారిన ఆడపిల్ల
ఆదిశక్తి యెట్లవుతుంది
కొడుకులకు జన్మనిచ్చి
కోరికలను చంపుకుని
పెంచిపోషించి
ఆ కొడుకులచే వెలివేయబడి
వెతలపాలై
నడిరోడ్డున బిక్షాటన చేస్తూ
అమ్మైనా అగచాట్లు మారని ఆడపిల్ల
ఆదిశక్తి యెట్లవుతుంది
లేరా లే పడుకుంది చాలు లేయరా
నీవెత్తిన రాయే నీ నెత్తురుచూసిందా
నీవెత్తిన గంపే నిన్ను గతింపజేసిందా
నీవెత్తిన ఇసుకే నీ ఊపిరి తీసిందా
నీవెత్తిన సిమెంటే నిన్ను చితికి చేర్చిందా
నీవు కట్టిన మేడే నీ మెడలు విరిచిందని
నీవాళ్ళకు నేనెలా చెప్పను
లేరా లే పడుకుంది చాలు లేయరా
నీకోసమే గుడిసె ముంగిట్లో
నాన్న తినడానికి
తేస్తాడని ఆశగా
ఎదురుచూస్తున్న పిల్లలకు
నీవు కట్టిన మేడే నీ మెడలు విరిచిందని
నేనెలా చెప్పను
లేరా లే పడుకుంది చాలు లేయరా
పెందలాడే లేచి
పసుపుకొమ్మకు మొక్కుకుని
వంట వండి
క్యారియర్ కట్టి
ఎదురొచ్చి వెళ్ళిరమ్మని చెప్పే నా చెల్లికి
నీవు కట్టిన మేడే నీ మెడలు విరిచిందని
నేనెలా చెప్పను
లేరా లే పడుకుంది చాలు లేయరా
వయసుడికిపోయిన
కన్నపేగును
రోడ్డున పడేసే ఈ రోజుల్లో
కంటికి రెప్పలా మావాడు
చూసుకుంటాడని
అందరికీ పొంగిపోయి
చెప్పుకునే …
అయ్య పనికెళ్ళగానే
నీవు కూలికి కదలగానె
ఇంట్లో ఉన్న అంట్లు తోమి
ఊరి చివర నుంచి కట్లుమోసి
మైళ్ళదూరం నడిచి నీళ్ళు తెచ్చిన నేను
నీకు బరువైయ్యానా అమ్మ
అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా
చదువుల పలక పట్టకుండా
చేలోని సెలికపట్టి
అయ్య వెంట తిరుగుతూ
సాళ్ళు నీళ్ళతో తడిపి
నేను కూడ తడిచిపోయి
పగిలిన ప్రత్తిలా నవ్విన నేను
నీకు బరువైయ్యానా అమ్మ
అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా
బువ్వ తినేటి గట్టుపై
పెరుగన్నపు ముద్దలాంటి నాపిల్లకు
పదేళ్లు నిండలేదంటూ
అందరికి చెప్పింది నువ్వే కదమ్మా
పదేళ్ళైన నిండని నన్ను
తాగి తాగి ప్రక్కూరి అక్కను
చంపేసిన సుబ్బయ్యకు
ఇచ్చేటంత భారమైయ్యానా నేను
నీకు బరువైయ్యానా అమ్మ
అయ్యచేసిన అరువుకు నన్ను అమ్మేస్తావా అమ్మా
ప్రక్కింటి అక్కలాగా
ఎదిరింటి అన్నకు
పేపరు నేనివ్వలేదు కదమ్మా
ఆ వీధి సుబ్బిలా మన వీధి ర…
కట్టుకున్నదానితో కలిసి
మండుటెండలో
పొలం గట్లపైనడిచి
ఎండుపుల్లలను
కుప్పచేసి కాల్చి
మదిలో ఎగిసే కోరికలతో
విత్తులేయాలని
నెర్రలువారిన చేలో
వానచినుకు కోసం
ఆగమేఘాలతో ఎదురుచూస్తున్న రైతు
రాజెట్లా అవుతాడు
చినుకు పడగానే
చిన్నపిల్లాడిలా గంతులేసి
కట్టుకున్న దాని కనకాన్ని
మార్వాడి కొట్టులో తాకట్టు పెట్టి
విత్తనాలు తెచ్చి
మొక్కలకు జన్మనిచ్చి
ఆ పచ్చని మొక్కలు ఎండుతుంటే
గుండెమండి
గుళ్ళో రాళ్ళకు నీళ్ళేసి విన్నవించుకుని
ఫలితంలేక
మొక్క మొక్కకు నీళ్ళుమోసి
భుజాలు కందిన రైతు
రాజెట్లా అవుతాడు
ఎదిగిన పంటతో
ఎన్నో కలలుకని
చీడ పీడ పట్టకుండా
ప్రాణాలను పణంగాపెట్టి
పురుగుమందులు పిచికారీ చేసి
చేతికొచ్చిన పంట
అకాల వర్షవిలయానికి గురికావడంతో
విషాదంలో మునిగిన రైతు
రాజెట్లా అవుతాడు
తడిచిన పంటను అమ్ముకోలేక
తల్లడిల్లిపోతూ
కనపడిన దళారికి …
బాల్య సామ్రాజ్యంలో
సుఖ సింహాసనంపై సేదతీరుతున్న రారాజు వీడు
ఎవడికొస్తది ఇంతటి అదృష్టం
ఉన్నదాంట్లో ఊపిరి పీల్చుకోవడమే
ఏ దశకైన ఉత్తమ లక్షణం
నిజమే కదా
వచ్చినప్పుడు ఉత్తదే
పోయేటప్పుడు ఉత్తదే
మధ్యలోనే కదా ఈ ఉన్ని బట్ట
ఆవేదనల బుట్ట
చివరికి మిగిలేది బూది గుట్ట
ప్రశాంతనను పట్టుకో
కష్టసుఖాలు ఆకుపై జారే నీటిబొట్లవుతాయి