పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
ప్రేయసీ ప్రియుల మధ్యన నెలకొన్న సచ్ఛీలతతో కూడిన ప్రేమ ఎంత మధురమైనదో అది అనుభవించిన ప్రేమికులకే అర్థమౌతుంది. స్వార్థరహిత ప్రేమ కలకాలం ఆ బంధాన్ని అత్యంత పటిష్టంగా నిలుపుతుంది. ప్రేమికుల మనస్సులో కలిగే భావాలు ఎప్పుడూ నిత్యనూతనమై, ప్రకృతితో మమేకమై ఉంటాయి. ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం కోసం శ్రీ శ్రీ గారు రచించిన ఈ పాటలోని పదాలు అత్యంత సరళమైనవి కానీ నిజానికి అవి అక్షర ఆణిముత్యాలు.
చిత్రం: ఇద్దరు మిత్రులు (1961)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గేయ రచయిత: శ్రీశ్రీ
గానం: ఘంటసాల, సుశీల
పల్లవి:
ఆ..ఆ ..ఆఆ...ఆఆఆ...ఆఆఆ....
ఓఓ.. ఓఓ..ఓఓఓఓ...ఓఓఓఓఓఓ.....
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా
చరణం 1:
ఈ వసంత యామినిలో..ఓ..ఓ..
ఈ వెన్నెల వెలుగులలో..ఓ..ఓ..
ఈ వసంత యామినిలో ఈ వెన్నెల వెలుగులలో
జీవితమే పులకించగ
జీవితమే పులకించగ
నీ వీణను సవరించి
పాడవేల రాధికా
చరణం 2:
గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
గోపాలుడు నిను వలచి నీ పాటను మది తలచి
ఏ మూలను పొంచి పొంచి
ఏ మూలను పొంచి పొంచి
వినుచున్నాడని ఎంచి
పాడవేల రాధికా
చరణం 3:
వేణుగానలోలుడు నీ వీణామృదు రవము వినీ
ఈ....ఈ...ఈఈ....ఈఈఈ.....
వేణుగానలోలుడు నీ వీణామృదు రవము వినీ
ప్రియమారగ నిను చేరగ దయచేసెడి శుభవేళ
పాడవేల రాధికా.... ప్రణయ సుధా గీతికా
పాడవేల రాధికా