మనిషి లో మానవత్వం లోపించినప్పుడే తనలోని రాక్షస ప్రవృత్తి బయటకు వస్తుంది. ఆ క్షణంలో మనిషి విచక్షణ కోల్పోయి తనను తానూ నియంత్రించుకునే స్థితిని కూడా కోల్పోతాడు. అందుకు తగిన కారణాలు విశ్లేషిస్తే మనిషి పుట్టినప్పటి నుండి పెరిగే వాతావరణం, పరిసరాలు కూడా జీవితం మీద ప్రభావితం చూపుతాయి. పైపెచ్చు మద్యం మన మెదడు మీద ఎంతో ప్రభావం చూపుతుంది. అందుకే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరిలో విలువలతో కూడిన సంప్రదాయ జీవన సరళి ఎంతో అవసరం. అయితే ప్రస్తుతం అది ప్రపంచం నేడు లేదు. కుటుబంలో ఒకరితో ఒకరికి సంబంధాలు లేని జీవితాలు, విద్యావ్యవస్థలు, ఇలా ఎన్నో అంశాలు ఈ సమాజంలో ఉన్నాయి. వ్యవస్థలో మార్పురానంత వరకూ మనం ప్రశాంత జీవనాన్ని పొందలేము. మార్పు అనేది మనిషి మైండ్ సెట్ మారనంతవరకు రాదు. విషయం జరిగిన తరువాత విశ్లేషణ విపరీతంగా చేస్తాము. కానీ వెంటనే మరిచిపోతున్నాము. వ్యవస్థ మారాలి అంటే ముందు మన ఆలోచన విధానం మారాలి. మాటలు కాదు చేతలు కావాలి. మద్యం మత్తులో మనిషిలోని మానవత్వం రాక్షస ప్రవృత్తి గా మారుతుంది. దానిని కట్టడి చేసేదెలా? మరో విషయం. నేడు మానవ బంధాన్ని మనీ బంధం ముంచేస్తున్నది. నైతిక విలువలు నేడు తగ్గి ‘నేను’ అనే మాట ఎక్కువగా మన మనసులలో తిష్ట వేసుకొంటున్నది. అందుకే మనలో ‘మంది కోసం మనం’ అనే ఆలోచన మొదలవ్వాలి.
నేడు మన సమాజంలో ఉన్న మరొక్క సమస్య పెద్దవాళ్ళకు, పిల్లలకు మధ్యన సఖ్యత లోపించడం.
పెద్దవాళ్ళను కదిలిస్తే పిల్లల్లో పెద్దల పట్ల గౌరవం పూర్తిగా లోపించింది. వారి మాటకు కనీస విలువ కూడా ఇవ్వడం లేదు అని చెబుతారు. అయితే మనలో ఎంతమంది రోజులో కనీసం 15 నిమిషాలైనా పిల్లలతో కూర్చుని సరదాగా సమయాన్ని గడుపుతున్నారు? పిల్లలకు బయట స్నేహితులు కూడా వుండటం లేదు. మరి వారికి వచ్చే క్రియేటివ్ ఐడియాస్ ఎవరితో షేర్ చేసుకొంటారు. ఎంతసేపు సోషల్ మీడియా కు అతుక్కుపోవడం తప్ప. మరి వారికి బంధాలు, పెద్దలను గౌరవించేదేలా? వాస్తవిక ప్రపంచానికి ఎంత దగ్గరగా ఉన్నారు – తదితర విషయాలు పెద్దలు అనుభవ పూర్వకంగా తెలుసుకున్నది వారికి చెబితే ఈ సమస్యకు పరిష్కారం దొరకవచ్చు.
పిల్లలు కూడా మారుతున్న సమాజ పోకడలను ఆకళింపు చేసుకొని తమ జీవితాలకు ఏది సరిపోతుందో చూసుకొని ఆ జీవన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం. అంతేకానీ, తల్లిదండ్రులు చెప్పారనో, లేక తన ఆప్త మిత్రులు అందరూ అదే మార్గంలో వెళుతున్నారు కనుక తను కూడా ఆ పంథాలో వెళ్ళాలనుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ‘no two human brains are alike’. అలాగే ప్రకృతితో మమేకమై సహజ సిద్ధమైన జీవితాన్ని అవలంబిస్తే శరీరానికి ఎటువంటి హాని జరుగదు. పూర్తి ఆరోగ్యంతో శక్తివంతులవుతారు. వారి శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ మరింత బలపడుతుంది.
చాలా బాగుంది madhu .pl. send you e-mail ID