ఒక్క క్షణం
- రాఘవ మాస్టారు
ఓ మనిషీ!
డబ్బు జబ్బు మనిషీ!
అంతులేని ఆశలకుషీ!
ఒక్క క్షణం
ఏనాడైనా ఆలోచించావా!
రోజూ అదే తిండి
అదే నిద్ర, అదే సుఖం
అదే మొఖం, అదే పని
అదే ధ్యాస
అదే బ్రతుకు
తన కోసం
తన ఆలికోసం
తన పిల్లల కోసం
తనవారికే సంపద
రోజంతా క్షణం క్షణం
తీరిక లేక
ప్రతి క్షణం
కోరిక పోక
అదే బ్రతుకు
అదే గతుకు
సిగ్గుగా లేదా?
నిగ్గు రాదా?
విసుగు లేదా?
వెగటు కాదా?
ఒక్కరైనా
ఒక్క క్షణమైనా
దేశం కోసం
జనం కోసం
జగతి కోసం
ప్రగతి కోసం
ప్రకృతి కోసం
జాగృతి కోసం
ఆలోచిస్తున్నామా?
ఆవేశిస్తున్నామా?
మనకు మనసులేదా?
మనం మనుషులం కాదా?
రోజూ ఒకటే ఆలోచన
అనుదినం ఒకటే ఆవేదన
డబ్బు, డబ్బు, డబ్బు
జబ్బు, జబ్బు, జబ్బు
మాటల్లో వేదం
మనస్సులో స్వార్థం
చదువుల్లో నీతిబోధ లేదు
జాతి జ్యోతి లేదు
సనాతన ధర్మం రాదు
హిందూ ధర్మ మర్మం లేదు
విదేశీ వెరవులు
దేశభక్తి శూన్యం
ఇదేనా మనం అనుక్షణం అనుకునేది?