‘అందరూ మాట్లాడే భాషే అమ్మ భాష’ అనే సూత్రం మనకందరికీ తెలుసు. అయితే ఒక భాష అమృత భాషగా కలకాలం వర్థిల్లాలంటే అందుకు సరైన సమాచార వాహకాలు ఉండాలి. మన భాషలో చెప్పాలంటే అనేక రకాలైన ‘పత్రికలు’ ఆ కార్యాన్ని నాటినుండి నేటి వరకూ, నిరంతం నిర్వర్తిస్తూ వస్తున్నాయి. ఒక పత్రిక మంచి సాహితీ విలువలతో భావితరాలకు మంచి భాషా సౌరభాలను అందించాలంటే అందుకు ఆ పత్రిక సంపాదకుడిదే ప్రధాన బాధ్యత.
ఒకప్పుడు సంపాదకుడు అంటే మార్పులు, చేర్పులు, కూర్పులు తదితర ధర్మాలను పరిగణలోకి తీసుకొని తమ వృత్తి ధర్మాన్ని తప్పక పాటించేవారు. ఉదాహరణకు తాపి ధర్మారావు, నార్ల వెంకటేశ్వరరావు, నండూరి రామమోహనరావు, గురజాడ అప్పారావు మొదలు నేటి వరకూ ఎందఱో మేధావులు తమ సృజనాత్మక పాండిత్యంతో పత్రికల విలువలనూ పెంచుతూ వచ్చారు. కానీ సంపాదకీయం అనే పదానికి కాలానుగుణంగా అర్థం కూడా మారుతూ వస్తున్నది. సంపాదకుడు అంటే ‘సంపాదన మీదే దృష్టి పెట్టి అందుకు సదా కృషి సల్పేవాడు’ అనే వారు లేకపోలేదు. అందువలననే నేడు మన తెలుగు భాష యొక్క ఉనికిని ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు మన రాఘవ మాస్టారు చేసిన ఒక చిన్న ప్రక్రియ మీకోసం.
ఒకటే పద్దెము రెండు విధాలుగా:
తేటగీతి (ఆంద్ర భాష – సంస్కృతం కలసినది)
మాతృభాష మధురమురా మాతృభూమి
సుందరమురా మనల జాతి శోభితమ్ము
వివిధ జాతుల ఎన్నియో జీవనాలు
కలసి మెలసిన ప్రజలది ఘన చరితము
తేటగీతి: అచ్చ తెలుగు మాటలతో (తెలుగు భాష)
అమ్మ నుడి కమ్మదనమురా అమ్మ నేల
పొలుపురా, మనలకుదురు పురుల వెలుగు
పెను కుదురులు మనుగడలు అనుగు చుండె
కూడి వున్న ఎగులుకోటి గొప్ప మెలన