నిత్య సత్యాలు
గమ్యమేదో తెలిస్తే నిశ్చింత,
మరి అది తెలియకుంటేనే....చింత.
చల్లకొచ్చి దాచకూడదు ముంత,
అజ్ఞానానికి పాడకూడదు వంత.
జీవితమంటేనే అతుకుల బొంత,
సద్విచారానికై నీ సమయాన్ని వెచ్చించు కొంత.
పడకు, చూసుకో ఎదురుగా ఉంది గుంత,
కొంతమందిలో పులుపు చావదు చచ్చినా చింత.
ఏం చూసుకొని అహంకారం నీకింత,
మృత్యువు కాసుకొనే ఉంటుంది నీ చెంత.
ఇన్ని విషయాలు తెలుసుకున్నాక ఇప్పుడు నీ వివేకం ఎంత?
చేసినదే అనుభవిస్తాము,ఈజీవితమే అంత.