Menu Close
తేనెలొలుకు
- రాఘవ మాష్టారు

నేను, నాది
నా వాళ్ళు అనే అహంకారం తో
నాకే కాక
అన్నీ నా వారికే అనే అత్యాశ తో

నాకేం ?
నేనే గొప్ప నే అహం తో
నాకే మెప్ప నే మోహం తో
నీవే నను ప్రేమించాల నే
అవివేకంతో
నీతో నాకేం పని లేదనే
అజ్ఞానం తో

నిను తలచడం మానినపుడు
నీతిగా బ్రతగడం లేనపుడు
మమకారం దూరమై
అనురాగం భారమై

వయసు మీరిన నేడు
మనసు వీగిన ఈ నాడు
నాకు శాంతి కరువై నది
నాకు కాంతి దూరమై నది

నా హృదయం భగ్నమై నది
బీటలు వారి చీలికలై నది

నీ ప్రేమ వర్షించి చాలా కాలమైంది
నా మనసు పులకించి చాలా కాలమైంది
నీ చల్లని చూపుల చినుకుల కోసం
నా మది పడి గాపులు గాస్తుంది

నిరాశతో
నా హృదయా న్నెందుకు మండిస్తావు
క్రూరంగా
ఇంకా నన్నెందుకు దండిస్తావు

ప్రభో!
నీ జేసిన తప్పిదం
ఈ మానవ నైజపు
రాగద్వేషాల చట్రంలో
కామార్థాల పాశంలో
నిరంతరం ఇరుక్కుపోవడమే
జీవిత సత్యం తెలియక పోవడమే

ప్రభో! నను క్షమించు
వయసు పెరిగి పోతుంది
మనసు తరిగి పోతుంది
నల్లని నింగి మృత్యువు వోలె
ఉగ్ర రూపంతో ఉంది
ఎండిన నేల కలి పురుషుని
జే రి కరాళ నృత్యం లా ఉంది

ప్రభో! ఇకనైనా
నీ ప్రేమ కరుణామయ ప్రభంజనాలతో
ఆ వర మేఘమాల ను నా వైపుకు పంపించు

ఆకాసంపై జ్ఞాన మెరుపు కొరడాలను ఝుళి పించు
నా పై అనన్య సుధామయ ప్రేమ జల్లులు కురిపించు

నిశ బ్ధంగా
మానవాళి నంత టా కమ్ము కొన్న
ఈ మాయా మోహపు అజ్ఞాన బడభాగ్ని చల్లార్చు
ఈ జనానికి అద్ధ్వైత జ్ఞానోదయం కలిగించూ

Posted in February 2021, తేనెలొలుకు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!