నవ్వుకుంటూ మనసారా ఆనందిద్దాం
ఈ శీర్షికలో ఎప్పుడూ ఎదో ఒక విషయం గురించి వ్రాయడం జరుగుతున్నది. అది వైజ్ఞానికం కావచ్చు, చరిత్ర కావచ్చు, ఆరోగ్య రహస్యం, వింతలు... ఇలా రకరకాలు. అయితే అది ఒక పాఠంగా అందరికీ అనిపించి బోర్ కొట్టడం జరగవచ్చు. అందుకని ఈ సంచికలో ఏదైనా విభిన్నంగా ‘టూకీగా’ ఏమి వ్రాద్దామని ఆలోచిస్తుంటే, ఈ మధ్యనే నాకు మా స్నేహితుడొకరు షేర్ చేసిన ఈ తలతిక్క సమాధానాలు నాకు గుర్తుకు వచ్చాయి. వాటిని మీతో పంచుకొంటున్నాను. ఓపికగా ఈ ప్రశ్నలు, సమాధానాలు తయారుచేసి తద్వారా మనందరికీ ఎంతో మనోల్లాసాన్ని అందించిన ఆ వ్యక్తి ఎవరైననూ వారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. ఇది అందరూ హాయిగా నవ్వుకోవడానికి మాత్రమే.
- తాజ్ మహల్ ఎక్కడ ఉంది?
జవాబు: కట్టిన చోటే! - చలికాలంలో ఐస్ క్రీం తింటే ఏమవుతుంది?
జవాబు: కప్పు ఖాళీ అవుతుంది. - రెండు మామిడి పళ్ళను ముగ్గురు ఎలా పంచుకోవాలి?
జవాబు: రసం తీసి! - గుడికి వెళ్ళినప్పుడు బొట్టు దేనికి పెట్టుకుంటారు?
జవాబు: నుదుటికి! - బస్సులో ఎంతమంది కూర్చోవచ్చు?
జవాబు: పట్టినంత మంది! - ఆఫ్రికా గిరిజనులు అరటిపండు ఎలా తింటారు?
జవాబు: ఒలుచుకొని - హుసేన్ సాగర్ లో బుద్ధుడు ఒక చేతిని పైకి ఎత్తి ఉంటాడు ఎందుకు?
జవాబు: కింద నీరు పెరిగితే పైకి పోతారని చెప్పేందుకు! - నిద్రలో మంచం మీద నుంచి కిందపడితే ఏమౌతుంది?
జవాబు: మెలకువ వస్తుంది. - రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లు ఎందుకు పెడతారు?
జవాబు: డ్రైవర్ ని నిద్ర లేపడానికి. - సెల్ ఫోన్ పోతే ఏమౌతుంది?
జవాబు: మనశ్శాంతి ఫ్రీగా వస్తుంది. - నిమ్మకాయ సగానికి కోసి రసం ఎందుకు పిండుతారు?
జవాబు: తొక్క తీస్తే టైం వేస్ట్ కాబట్టి. - టివి రిమోట్ అంటే మగవారికి ఎందుకు అంత ఇష్టం?
జవాబు: ఇంట్లో అదొక్కటే తను చెప్పినట్టు వింటుంది కాబట్టి! - అమ్మాయిలకు పెళ్లి ఎందుకు చేస్తారు?
జవాబు: ప్రేమలకు పుల్ స్టాప్ పెడతారని. - స్విచ్ వేయగానే ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది.?
జవాబు: తిరగక పోతే కర్రతో కొడతారని. - పెళ్లి చూపులకు అబ్బాయినే అమ్మాయి ఇంటికి ఎందుకు తీసుకెళతారు?
జవాబు: బలి ఇచ్చేముందు మేకనే గుడి దగ్గరకు తీసుకెళతారు కాబట్టి.
good questions