Menu Close
Kadambam Page Title
నా ఉన్నత స్థితి నా శ్రీమతి...
-- అభిరాం --
NaaSrimathi-Abhiram

అపుడెపుడో నాలుగేళ్ళ క్రితం
మనువు మండపాన అక్షింతల ఆశీస్సులతో
తళుక్కుమన్న మా దాంపత్య చిత్రం...

పత్తిచేలో ఎరువుచల్లే ఘడియన
ఇపుడు వాన చినుకుల ఆశీస్సులతో
టార్పాలింగ్ గూడులో సెల్పీ కన్నుకి తళుక్కుమంది...

ధర్మార్ధ కామ మోక్షసాధనకు
శ్రీమతే కదా ఆది మెట్టు...
కట్టుకున్నది అనుకూలవతి అయితే
ఆ జీవితం ఆనందవన జీవనసార ఆత్మీయగట్టు...

నా ఆలోచనలకు, నా కలలకు
నా జీవన గమనమునకు
అండదండగుండే అర్ధాంగిని ఇచ్చినందుకు
ఆ ఆది దంపతులకు ధన్యవాదాలు...

నా ఆలోచనల ఒత్తి, నా ఆచరణ సత్తువ
నా మనసు మురిసే ప్రేమ
నా మతికి ఉన్నత ఉత్సాహ స్థితి
నువ్వే నా శ్రీమతి...

పొలం పనుల్లో, ఇంటిపనుల్లో
మన కుమారులను తీర్చిదిద్దే పనిలో
అలుపెరుగని శ్రమ కావ్యమైన నీకు
నా హృదయస్థానం తప్ప ఏమీ ఇవ్వలేని పేదోడిని శ్రీమతి...

Posted in November 2024, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *