Menu Close
Kadambam Page Title
మౌన ముద్ర ..!!
డా.కె .ఎల్.వి.ప్రసాద్

మౌనభాషలో నువ్వు
హృదయ ఘోషలో నేను,
నాకు నువ్వు -
నీకు నేనూ .....
అర్థం కాని సందర్భాలు!

కాలం తో పాటు -
కరిగిపోతున్న,
అద్భుతసమయాలు,
తిరిగి రాని
మధుర సందర్భాలు!

నీ ..ఆరాధనలో ...
నువ్వు నా స్వంతం
అన్నభావనలో ...
నిన్ను నీవు సంరక్షించుకునే
సురక్షిత సూత్రాలను
నీ ముందు వుంచాను,
అవగాహన చేసుకుని
అర్థం చేసుకుంటావనుకున్న!

కాలం కలసిరాక
మన ఆలోచనల్లో -
తేడా తెలిసిరాక,
నువ్వు నాకు దూరమయ్యావో,
నువ్వే నన్ను దూరంగ నెట్టావో
తెలీదుకానీ ....
మౌనంలో నువ్వు
ఆనందాన్ని --
అనుభవిస్తున్నావేమో గానీ
నాకైతే ....
ఇది పెద్ద శిక్షే ....
మరణం దీనికి తీసికట్టే!

అయినా ....
నాబ్రతుకులో
నువ్వెప్పుడూ
ముఖ్యభాగమే ....!

నిన్ను తలవని క్షణం
నీ జ్ఞాపకాలు
నెమరువేయని క్షణం
లేదంటే నమ్మగలవా?
అయినా ---
నీ ..మౌన ముద్రను
వీడమని నిన్ను
వేడుకోలేను -కానీ,
నిత్యం --
నీ సుఖమే నే కోరుకుంటా!!

Posted in May 2021, కవితలు

6 Comments

  1. డా.కె.ఎల్.వి.ప్రసాద్

    అంత వివరంగా చెప్పాక ఇంకా “మౌనముద్ర” అనడం ఎందుకు? ఇంతకీ ఎవరా రహస్య ప్రేమికురాలు?

    ఇలాంటి ప్రేమ, విరహం కవితలు అంటే నాకు చిరాకు. మొదలు పెట్టేటప్పుడు విసుగ్గా మొదలు పెట్టాను, కానీ రాన్రాను గాఢత బాగా ఉంది. కవిత్వం, ఆవేదన బాగా కన్పిస్తోంది. బాగుంది. నిజమేనా ! ఇంతకీ ఎవరామె! ఎందుకు మౌనం వహించింది! ఏమీ లేదు, ఒట్టి కవిత అని బుకాయించడండి.😀

    —–డా.సి.హెచ్.సుశీల
    గున్టూరు.

  2. మొహమ్మద్ అఫ్సర వలీషా

    చాలా చక్కని భావ పూరిత కవిత సూపర్బ్ సార్ హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!