మరువకు మన మాతృ భాష
వనమై విరబూసిన తెలుగు పూల తోట
వాడుకలో లేక వాడిపోతున్నది
సుందరమైన తెలుగు మాటలు
సుట్టం సూపుగా అయ్యాయి
మధురిమలు పలికించే
తెలుగు మాటలన్నీ నేడు..
గువ్వలా ఏ మూలనో ఒదిగాయి
అమ్మ అని ప్రేమతో హత్తుకునే
తెలుగు మాట నోట రాక
మమ్మీగా రూపాంతరమైనది
మాతృ భాషను మరిచి నేడు
పరభాషలకై పరుగు తీస్తున్న వెర్రి జనం
ఒక్కసారి తిరిగి చూడు
గురుతురాదా నీవు పలికిన మొదటి మాట
సుగంధాలు కురిపించే భాష
నీకు చులకనైనదా సోదరా
ఏ భాషలోనూ ఎరుగని తియ్యదనం
మాతృభాష తెలుగు నందు దొరుకుతుంది
మరువకు మాతృభాష,
మమతల నెలవైన మరో మాధుర్య తేనె ధార.