Menu Close
Kadambam Page Title
మగువ
-- సాండేసరి రుచిత --

మనువాడిన మగవానికి
మరులుగొలిపే మహారాణి..
మనసిచ్చిన వాడికి
మమతల పూబోణి..
వంచకులకు అవుతుంది ఝాన్సీ రాణి..

మెట్టింట నడయాడే గృహలక్ష్మి..
సిరులు కురిపించే శ్రీలక్ష్మి..
అత్త మామల సేవలో మహాలక్ష్మి
పసి పాపలను లాలించే మాతాలక్ష్మి

జీవితంలో ఆటుపోట్లు ఎన్ని వచ్చినా ,
కుంగిపోదు ఆమె ఎప్పటికైనా..
చూపిస్తుంది ఔదార్యం అడుగడుగునా..

అధితి అయినా , అభ్యాగతి అయినా,
విసుగనేది కనిపించదు ఆమె మనసులోన..
ఆదరిస్తుంది వారిని అనురాగంతోన..

పేదరికం వున్నా పరితపించదు లలన..
కన్నీళ్లను దాచుతుంది కనురెప్పల చాటున..

బాధలు ఎన్ని వున్నా, కనిపించవు పైన..
దాచుకుంటుంది వాటిని తన మనసులోన..

అవి వచ్చి పోయే చీకటి , వెలుగుల్లాంటివే
అని ఓదార్చుకుంటుంది తనలోన..

కన్న పిల్లలను చూసుకుని అన్నీ
మరచిపోతుంది ఆ క్షణాన..

ఆత్మీయతలు కురిపుంచే పడతి..
అనురాగ సుధలు చిలకరించే సుదతి..
గౌరవిద్దాం ఆమెను నిండుమనసుతో..
ఆదరిద్దాం ఆమెను సహృదయంతో..

Posted in April 2025, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!