మావి చిగురు తినగానే..
మావి చిగురు అంటే వసంత మాసంలో చిగురించే మామిడి పూత. అది కొంత వగరుగా, చేదుగా ఉంటుంది. అయితే ఎంతో కమ్మగా కూడా ఉంటుంది. అందుకే ఉగాది పచ్చడి తయారీకి ఉపయోగపడుతుంది. మావి అంటే మామిడి, చిగురు అంటే వగరు అని అర్థం. మావి చిగురు తినగానే కోయిల పలికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా ఏమో ఎవరికీ తెలుసు. ప్రకృతిలో అన్నీ ఒకదానికొకటి అవినావభావ సంబంధంతో ముడివేసుకొని ఉంటాయి. అలాగే భార్యా భర్తలు ఒకరితో ఒకరు మమేకమై అన్యోన్యంగా జీవించాలని కవి భావన. బింకాలు... బిడియాలు..పొంకాలు... పోడుములు.. ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి.. గడసరి...అన్న పదాలకు ఎంతో అర్థముంది. ప్రశాంత జీవనసోపానానికి చక్కటి దారి చూపుతుంది.
చిత్రం: సీతామాలక్ష్మి (1978)
సంగీతం: కె.వి. మహదేవన్
సాహిత్యం: దేవులపల్లి
గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల
పల్లవి:
మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా...
మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
ఏమో..ఏమనునోగాని ఆమని...ఈవని..
మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ..కోయిల పలికేనా
చరణం 1:
తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటలా
తెమ్మెరతో తారాటలా... తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా ..సయ్యాటలా.. సయ్యాటలా.. తారాటలా
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు... బిడియాలు..
పొంకాలు... పోడుములు..
ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి.. గడసరి...
మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ...కోయిల పలికేనా
చరణం 2:
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా.. వేరొకరి గుండె జంపాల..
ఉయ్యాలా.. జంపాల.. జంపాల.. ఉయ్యాలా
ఒకరి ఒళ్ళు ఉయ్యాలా... వేరొకరి గుండె జంపాల
ఒకరి పెదవి పగడాలో.. వేరొకరి కనుల దివిటీలో..
ఒకరి పెదవి పగడాలో.. వేరొకరి కనుల దివిటీలో..
పలకరింతలో... పులకరింతలో...
పలకరింతలో... పులకరింతలో..
ఏమో ఏమగునో గాని ఈ కత.. మన కత..
మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ.. కోయిల పలికేనా
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా..
ఏమో..ఏమనునోగాని ఆమని...ఈవని...
మావి చిగురు తినగానే..ఏ..ఏ..ఏ..ఏ..
కోయిల పలికేనా..ఆ...కోయిల పలికేనా...